జైలర్3 విషయంలో నెల్సన్‌కు సన్ పిక్చర్స్ ఫ్రీహ్యాండ్
సూపర్‌స్టార్ రజనీకాంత్(Rajinikanth)కు జైలర్(Jailer) సినిమాతో భారీ సక్సెస్‌ను అందించిన డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్(nelson dileep kumar) ఈ ఫ్రాంచైజీని మరింత విస్తరించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే జైలర్2(Jailer2)పై భారీ అంచనాలు నెలకొనగా, మూడో భాగం జైలర్3(Jailer3) ను కూడా నిర్మించేందుకు సన్ పిక్చర్స్(Sun pictures) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈ సినిమా వెంటనే పట్టాలెక్కే అవకాశం లేదు. కథను మరింత బలంగా తీర్చిదిద్దేందుకు నెల్సన్‌కు నిర్మాతలు పూర్తి స్వేచ్ఛను కల్పించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బడ్జెట్, నటీనటుల ఎంపిక, రెమ్యూనరేషన్ల విషయంలో ఎలాంటి లిమిటేషన్స్ పెట్టకుండా డైరెక్టర్ డెసిషన్‌కే ప్రాధాన్యత ఇవ్వాలని సంస్థ భావిస్తోందట.
స్క్రిప్ట్ విషయంలో ఎప్పుడూ తొందరపడని నెల్సన్.. ప్రీ ప్రొడక్షన్‌కు కూడా తగినంత టైమ్ కేటాయిస్తుంటారు. జైలర్2 కు భారీ రెమ్యూనరేషన్ అందుకున్నప్పటికీ బడ్జెట్ పై కొన్ని లిమిట్స్ ఉండగా, మూడో భాగానికి మాత్రం అలాంటి రూల్స్ ఉండబోవని సమాచారం. ప్రస్తుతం జైలర్3కి సంబంధించిన ప్రాథమిక ఆలోచన సిద్ధంగా ఉండటంతో, పూర్తిస్థాయి స్క్రిప్ట్‌ను రూపొందించేందుకు ఆయన కొన్ని నెలల టైమ్ తీసుకోనున్నారు. అన్ని పనులు పూర్తైన తర్వాత 2028లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశముంది.
ఇదిలా ఉంటే, రజనీకాంత్‌తో పాటు కమల్ హాసన్ నటించే భారీ మల్టీస్టారర్ సినిమాకు నెల్సన్ దర్శకత్వం వహించనున్నారు. ఈ ప్రాజెక్ట్ షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభమయ్యే సూచనలు ఉన్నాయి. మరోవైపు సితార ఎంటర్టైన్మెంట్స్(Sithara entertainments) నిర్మాణంలో ఎన్టీఆర్(NTR) హీరోగా ఓ సినిమాను తెరకెక్కించేందుకు కూడా ఆయన అంగీకరించారు. దీంతో నెల్సన్ రాబోయే ప్రాజెక్టులు సౌత్ సినీ ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారాయి.







