కజకిస్థాన్‌లో వెంకీ, కళ్యాణ్ రామ్ హైఓల్టేజ్ యాక్షన్
విక్టరీ వెంకటేష్(Venkatesh), నందమూరి కల్యాణ్ రామ్(Nandamuri kalyan ram) తొలిసారి కలిసి నటిస్తున్న మల్టీస్టారర్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది. అనిల్ రావిపూడి(Anil ravipudi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి జనవరి 12 విడుదల(january 12 vidudhala) అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ కజకిస్థాన్‌లోని అందమైన పర్వత ప్రాంతాల్లో జరుగుతోంది. ఇద్దరు స్టార్ హీరోలపై భారీ యాక్షన్ సీన్స్ ను షూట్ చేస్తున్నారు. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు తనదైన శైలి కామెడీ, కమర్షియల్ అంశాలను జోడించి అనిల్ రావిపూడి ఈ సినిమాను రూపొందిస్తున్నారు.
ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్ రియల్ సతీష్ పర్యవేక్షణలో ఈ యాక్షన్ ఎపిసోడ్‌ను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. సహజసిద్ధమైన పర్వత ప్రాంతాలను నేపథ్యంగా చేసుకుని రూపొందిస్తున్న ఈ ఫైట్ సీన్స్ సినిమాలో మెయిన్ ఎట్రాక్షన్ గా నిలవనున్నాయి. ముఖ్యంగా వెంకటేష్, కల్యాణ్ రామ్ మధ్య వచ్చే సీన్స్ ఆడియన్స్ కు కొత్త అనుభూతిని అందిస్తాయని చిత్రవర్గాల సమాచారం. యాక్షన్ షెడ్యూల్ పూర్తైన తర్వాత ఇద్దరు హీరోలు, హీరోయిన్లు కీర్తి సురేష్(keerthy suresh), కృతి శెట్టి(Krithi Shetty)లపై ఓ భారీ సాంగ్ ను షూట్ చేస్తున్నారు.
సాహు గారపాటి(Sahu garapati) భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాను నిర్మిస్తున్నారు. జివి ప్రకాష్ కుమార్(GV Prakash Kumar) మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొనగా, సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే భావోద్వేగాలు, నవ్వులు, భారీ యాక్షన్‌తో ఈ మల్టీస్టారర్ పండుగ బరిలో సందడి చేయాలని చిత్రబృందం భావిస్తోంది.







