సంక్రాంతి బరిలోకి మెగాస్టార్ విశ్వంభర!
మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi) హీరోగా తెరకెక్కుతున్న భారీ సోషియో ఫాంటసీ మూవీ విశ్వంభర(viswambhara) ఎట్టకేలకు రిలీజ్ కి సిద్ధమవుతోంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయి దాదాపు రెండేళ్లు కావస్తున్నప్పటికీ, విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో మేకర్స్ పలుమార్లు మార్పులు చేర్పులు చేశారు. దీంతో సినిమా రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది. అయితే తాజాగా ఈ సినిమా రిలీజ్‌కు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో ఇప్పటికే డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకోగా, సినిమాను 2027 సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేయాలని చిత్రబృందానికి సూచించినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో చిరంజీవి కూడా సంక్రాంతి రిలీజ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీనిపై ఈ నెలలో అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశముంది. మరోవైపు నిర్మాతలు ప్రస్తుతం థియేట్రికల్ బిజినెస్ డీల్స్‌ను ముగించే పనిలో ఉన్నారు. వరుస ఫ్లాపులతో కొంత వెనుకబడిన యూవీ క్రియేషన్స్ సంస్థకు విశ్వంభర సక్సెస్ ఎంతో కీలకం కానుంది. ఈ సినిమాతో మళ్లీ పుంజుకోవడంతో పాటు, త్వరలో ప్రభాస్‌తో మరో ప్రాజెక్టును అనౌన్స్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
డైరెక్టర్ వశిష్ఠ(vassishta) తెరకెక్కిస్తున్న ఈ సోషియో ఫాంటసీ సినిమాలో త్రిష(trisha) హీరోయిన్ గా నటిస్తుండగా, ఎం.ఎం. కీరవాణి(MM keeravani) మ్యూజిక్ ను అందిస్తున్నారు. భారీ విజువల్స్, ఫాంటసీ ప్రపంచం, వినోదాత్మక అంశాలతో రూపొందిన ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ లో భారీ అంచనాలున్నాయి. మరి సంక్రాంతి బరిలో విశ్వంభర ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.








