Viswambhara: విశ్వంభర స్టోరీ లైన్ ఇదే!

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) హీరోగా వచ్చిన సినిమాల్లో ఎన్నో సూపర్ హిట్లు ఉండగా, అందులో ఫాంటసీ జానర్ లో వచ్చిన అంజి(anji), జగదేక వీరుడు అతిలోక సుందరి(JVAS) సినిమాలకు ఆడియన్స్ లో స్పెషల్ క్రేజ్ ఉంది. ఆ సినిమాల తర్వాత మళ్లీ చిరూ(Chiru) ఆ జానర్ లో సినిమా చేసింది లేదు. ఇప్పుడు మళ్లీ ఇన్నేళ్లకు విశ్వంభర(Viswambhara) అనే సోషియో ఫాంటసీ సినిమా చేస్తున్నారు చిరంజీవి.
బింబిసార(Bimbisara) ఫేమ్ వశిష్ట(Vassishta) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి రీసెంట్ గా డైరెక్టర్ మాట్లాడాడు. ఈ సినిమా చేసేందుకు తనకు ఇన్సిపిరేషన్ ఏఎన్నార్(ANR) కీలుగుర్రం(Keelu Gurram) అని చెప్తున్నాడు. దాంతోపాటూ విశ్వంభర స్టోరీ లైన్ ను కూడా వశిష్ట చెప్పాడు. హీరోయిన్ కోసం హీరో పద్నాలుగు లోకాలు దాటి ఎలా తీసుకొచ్చాడనేదే కథ అంటూ వశిష్ట చెప్పుకొచ్చాడు.
ఈ లైన్ విన్న తర్వాత మెగాస్టార్ ఫ్యాన్స్ కు విశ్వంభరపై అంచనాలు భారీగా పెరిగాయి. వశిష్ట చెప్పిన కథకు మంచి విజువల్స్ పడితే సినిమా అదిరిపోవడం ఖాయమని ఫిక్సై పోవచ్చు. కీరవాణి(keeravani) సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో త్రిష(Trisha) హీరోయిన్ గా నటిస్తుండగా యువి క్రియేషన్స్(UV Creations) ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.