Viswambhara: గుమ్మడికాయ కొట్టేసిన మెగాస్టార్
చిరంజీవి(Chiranjeevi) హీరోగా వశిష్ట(Vasishta) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సోషియో ఫాంటసీ సినిమా విశ్వంభర(Viswambhara). ఈ సినిమా మొదలైనప్పుడు అందరికీ ఎన్నో అంచనాలున్నాయి కానీ ఎప్పుడైతే టీజర్ వచ్చిందో అందరి ఆశలను అడియాశలు చేసింది. టీజర్ లోని వీఎఫ్ఎక్స్ కు ఆడియన్స్ నుంచి దారుణమైన విమర్శలు కూడా వచ్చాయి.
దీంతో ఏకంగా మేకర్స్ ఆ బాధ్యతల్ని కొత్త వీఎఫ్ఎక్స్ టీమ్ కు అప్పగించారు. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన వీఎఫ్ఎక్స్ వర్క్స్ పూర్తవుతున్న కారణంగా విశ్వంభర పెండింగ్ షూటింగ్ ను పూర్తి చేయాలని మేకర్స్ దాన్ని కంప్లీట్ చేశారు. అందులో భాగంగానే బాలీవుడ్ హీరోయిన్ మౌనీ రాయ్(mouniRoy) తో స్పెషల్ సాంగ్ తెరకెక్కించారు.
స్పెషల్ సాంగ్ తో పాటూ పెండింగ్ ఉన్న టాకీ పార్ట్ ను కూడా పూర్తి చేసి గురువారంతో విశ్వంభర షూటింగ్ కు గుమ్మడికాయ కొట్టారని తెలుస్తోంది. త్రిష(Trisha), ఆషికా రంగనాథన్(aashika ranganathan) హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ ను మేకర్స్ త్వరలోనే వెల్లడించనున్నారు. యువి క్రియేషన్స్(UV Creations) నిర్మించిన విశ్వంభరకు కీరవాణి(Keeravani) సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.







