Viswambhara: విశ్వంభర కు డిస్ట్రిబ్యూటర్ రివ్యూ

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) హీరోగా వశిష్ఠ(Vasishta) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా విశ్వంభర(Viswambhara). సోషియో ఫాంటసీ సినిమాగా తెరకెక్కుతున్న విశ్వంభర ఇప్పటికే రిలీజవాల్సింది కానీ వీఎఫ్ఎక్స్ కంపెనీ చేతులు మారడం వల్ల ఈ సినిమా వాయిదా పడుతూ వస్తుంది. ఆల్రెడీ టాకీ పార్టు పూర్తి చేసుకున్న విశ్వంభరలో స్పెషల్ సాంగ్ షూటింగ్ ఒక్కటే పెండింగ్ ఉంది.
ఈ స్పెషల్ సాంగ్ ను బాలీవుడ్ బ్యూటీ మౌనీ రాయ్(Mouni Roy) తో చేయనున్నారని వార్తలైతే వచ్చాయి కానీ ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. ఇదిలా ఉంటే ఇప్పుడు విశ్వంభర గురించి బయటికొచ్చిన ఓ సూపర్ న్యూస్ మెగా ఫ్యాన్స్ ను తెగ ఎగ్జైట్ చేస్తుంది. ఓ డిస్ట్రిబ్యూటర్ ఈ సినిమాలోని కొంత మేర ఫుటేజ్ ను చూసి సినిమా వేరే లెవెల్ అని చెప్పారని ఓ మీడియా ప్రతినిధి పోస్ట్ చేయగా ఆ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది.
ఈ సినిమా కోసం వశిష్ట క్రియేట్ చేసిన వరల్డ్ చాలా అద్భుతంగా ఉందని చెప్తున్నారు. ఈ పోస్ట్ తో అందరికీ అంచనాలు బాగా పెరిగిపోయాయి. త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను సెప్టెంబర్ 18న రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. యువీ క్రియేషన్స్(UV Creations) భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకు కీరవాణి(Keeravani) సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.