కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వరుణ్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun tej) కెరీర్‌ను కొత్త దిశలో నడిపించేందుకు వరుస ప్రాజెక్టులతో రెడీ అవుతున్నాడు. కొరియన్ కనకరాజు(Corian kanakaraj)తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ ను అందుకున్న వరుణ్, కొత్త కథలను ఎంపిక చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో భారి(Bhaari) అనే స్పోర్ట్స్ డ్రామా ఉంది. యదు వంశీ(Yadhu vamshi) దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను నిహారిక కొణిదెల(niharika konidela) నిర్మిస్తున్నారు. అయితే, వరుణ్ తేజ్‌కు గాయం కావడంతో షూటింగ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. పూర్తిగా కోలుకున్న తర్వాతే ఆయన ఈ సినిమా సెట్స్‌లో అడుగుపెట్టనున్నారు. ఈ ప్రాజెక్టుపై మెగా ఫ్యాన్స్ లో ఆసక్తి నెలకొంది.
ఇదిలా ఉంటే, ఆయ్(aay) సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ అంజి(Anji) వరుణ్ తేజ్‌కు ఓ కొత్త కథను వినిపించి గ్రీన్ సిగ్నల్ అందుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం స్క్రిప్ట్‌కు తుది మెరుగులు దిద్దుతున్న ఆయన, పూర్తి కథను మరోసారి హీరోకు వినిపించాల్సి ఉంది. ఆ నెరేషన్ తర్వాతే ఈ సినిమా విషయంలో క్లారిటీ వచ్చే అవకాశముంది. కథ నచ్చితే వరుణ్ తేజ్ కెరీర్లో మరో విభిన్నమైన ప్రాజెక్ట్ చేరినట్లవుతుంది.
ఇవి కూడా చదవండి
మరోవైపు, అట్లీ(Atlee) దగ్గర పనిచేసిన బాలాజీ(Balaji) దర్శకత్వంలోనూ వరుణ్ తేజ్ సినిమా చేసే అవకాశాలున్నాయి. ఈ సినిమాను తమిళ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్(Karthic subbaraj) నిర్మించనున్నట్లు తెలుస్తోంది. నెక్ట్స్ ఇయర్ ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశముంది. మొత్తంగా భారి పూర్తైన తర్వాత మిగిలిన రెండు సినిమాలపై వరుణ్ తేజ్ దృష్టి సారించనున్నారు. గాయం నుంచి కోలుకుని షూటింగ్ ప్రారంభిస్తే, ఆయన కెరీర్లో రాబోయే రోజులు మరింత ఆసక్తికరంగా మారనున్నాయి.








