‘రాజా ది రాజా’ నుంచి యూత్ ఫుల్ మెలోడీ ‘తుఝ్‌పే ఫిదా’ సాంగ్ రిలీజ్
మోస్ట్ టాలెంటెడ్, ఎనర్జిటిక్ రుత్విక్‌ను హీరోగా పరిచయం చేస్తూ వృందావన్ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత కె. నిహారిక దాసరి చిత్రం ‘రాజా ది రాజా’. నేటి తరానికి కనెక్ట్ అయ్యే ఎమోషన్స్, అందమైన ప్రేమకథతో మేళవిస్తూ ఈ చిత్రం తెరకెక్కుతోంది.
ఇప్పటికే విడుదలైన టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మేకర్స్ మ్యూజికల్ జర్నీ స్టార్ట్ చేశారు. సినిమా నుంచి తుఝ్‌పే ఫిదా సాంగ్ ను విడుదల చేశారు.
మార్క్ కె. రాబిన్ స్వరపరిచిన ఈ మెలోడీయస్ లవ్ ట్రాక్‌కు మనోజ్ జూలూరి అందమైన సాహిత్యాన్ని అందించారు. హరిచరణ్, శక్తి శ్రీ గోపాలన్ వోకల్స్ పాటను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.
సముద్ర తీరంలో చిత్రీకరించిన ఈ పాట విజువల్‌గా ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తోంది. లీడ్ పెయిర్ మధ్య కెమిస్ట్రీ, అందమైన లొకేషన్స్, ఫ్రెష్ విజువల్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. హరి కిరణ్ మాస్టర్, ఈశ్వర్ పెంటి కొరియోగ్రఫీ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
పాటలో కనిపించిన రొమాంటిక్ ఫీల్, యూత్‌ఫుల్ ఎనర్జీ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.
టీజర్‌తో ఆకట్టుకున్న ‘రాజా ది రాజా’ ఇప్పుడు ‘తుఝ్‌పే ఫిదా’ పాటతో మరింత ఆసక్తిని పెంచింది.








