యాసపై ట్రోలింగ్.. రష్మిక స్ట్రాంగ్ రిప్లై ఇదే!
రష్మిక మందన్న(rashmika mandanna) కెరీర్‌ను గమనిస్తే, ఆమె ఎన్నోసార్లు భాషలు మారాల్సి వచ్చింది. ఇదేమీ ఆమె ప్లాన్ చేసిన స్ట్రాటజీ కాదు. అవకాశాలే ఆమె అలా భాష మార్చానికి కారణమయ్యాయి. కన్నడతో మొదలైన రష్మిక జర్నీ తెలుగు, తమిళం, హిందీ ఇండస్ట్రీల వరకు వెళ్లింది. అయితే ప్రతి భాషలో యాస, ఉచ్చారణపై సోషల్ మీడియాలో వచ్చే కామెంట్లు మాత్రం ఆమెను వెంటాడుతూనే ఉన్నాయి.
తన భాషా పరిజ్ఞానంపై రష్మిక చేసిన కామెంట్స్ ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఏ ఒక్క భాషలోనూ తాను ఎక్స్పర్ట్ ను కాదని, అన్ని భాషల్లోనూ ఆడియన్స్ తో కనెక్ట్ అయ్యేందుకు ప్రయత్నిస్తానని ఆమె చెబుతోంది. ప్రేక్షకుల భాషలో మాట్లాడేందుకు చేసే ప్రయత్నాన్ని వారిపై తనకున్న గౌరవానికి ప్రతీకగా చూస్తున్నట్లు వెల్లడించింది. తన మాతృభాష కొడవ అని, ఇతర భాషల్లోకి వెళ్లడం తన కెరీర్లో సహజంగానే జరిగిందని పేర్కొంది.
ఇక ట్రోలింగ్ విషయానికి వస్తే, ప్రతి కామెంట్‌కు రియాక్ట్ అవుతూ టైమ్ వేస్ట్ చేయడం తనకు ఇష్టం లేదని రష్మిక స్పష్టం చేసింది. మంచి కథలు సెలెక్ట్ చేసుకోవడం, సెట్స్‌పై తన పాత్రకు న్యాయం చేయడంపైనే దృష్టి పెడుతున్నట్లు తెలిపింది. గీత గోవిందం(geetha govindam), పుష్ప(pushpa), యానిమల్(animal) వంటి సినిమాలతో భాషల సరిహద్దులు దాటిన ఆమె, ప్రస్తుతం మైసా(Mysaa), రణబాలి(Ranabaali) వంటి ప్రాజెక్టులతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది.








