టాలీవుడ్ లో వరుస రిలీజులతో సందడి చేయనున్న హీరోలు
టాలీవుడ్లో కొందరు హీరోలు ఒకే సినిమాపై ఆధారపడకుండా వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా రాబోయే నెలల్లో పలువురు హీరోల సినిమాలు వరుసగా రిలీజ్ కానుండటం ఆసక్తిని పెంచుతోంది. దీంతో ఈ హీరోలకు బాక్సాఫీస్ వద్ద ఒక సినిమా తర్వాత మరో సినిమాతో తమ మార్కెట్‌ను నిలబెట్టుకునే అవకాశం దక్కనుంది.
శర్వానంద్(sharwanand) ఇప్పటికే భోగి(Bhogi) సినిమాను పూర్తి చేయగా, రిలీజ్ డేట్ ఫిక్స్ కావాల్సి ఉంది. మరోవైపు జార్జ్ క్రిష్(George krish) షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా సంక్రాంతి 2027కి ప్రేక్షకుల ముందుకు రానుంది. విశ్వక్సేన్(viswaksen) మాత్రం అత్యంత వేగంగా వరుస సినిమాలను రిలీజ్ చేయబోతున్నారు. కల్ట్(Cult), ENE2, లెగసీ(legacy) సినిమాలు అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యలో వరుసగా రానున్నాయి.
నితిన్(nithin) ప్రస్తుతం అలియాస్ రుక్మిణి(Alias rukmini)తో పాటు సితార ఎంటర్టైన్మెంట్స్(Sithara entertainements) నిర్మిస్తున్న మరో సినిమాలో నటిస్తున్నారు. వీటి రిలీజ్ డేట్స్ పై త్వరలో క్లారిటీ రానుంది. ఇక మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్(Dulquer salman) కూడా తెలుగు ప్రేక్షకులను వరుసగా పలకరించనున్నారు. ఆకాశంలో ఒక తార(Aakasam lo oka tara), శ్రీ శ్రీ(Sri Sri) సినిమాలు ఈ ఇయర్ లోనే రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. మొత్తంగా చూస్తే, రాబోయే షెడ్యూల్లో ఈ హీరోల సినిమాలు థియేటర్ల వద్ద ప్రత్యేకంగా కనిపించనున్నాయి.








