కళ్యాణ్రామ్పై అనిల్ రావిపూడి మాస్టర్ ప్లాన్!
సంక్రాంతి బరిలోకి వస్తున్న సినిమాల్లో జనవరి 12 విడుదల(January 12 vidudhala)పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. అనిల్ రావిపూడి(anil ravipudi) దర్శకత్వంలో వెంకటేష్(venkatesh), కళ్యాణ్‌రామ్(Kalyan ram), కీర్తి సురేష్(keerthy suresh), కృతి శెట్టి(Krithi shetty) ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతోంది. ముఖ్యంగా వెంకటేష్‌తో అనిల్ రావిపూడి కాంబినేషన్‌కు ఇప్పటికే ఉన్న క్రేజ్ ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తిని మరింత పెంచుతోంది. ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు తన మార్క్ కామెడీ, ఎంటర్టైన్మెంట్ను కలిపి అనిల్ ఈసారి ఎలాంటి ట్రీట్ ఇవ్వబోతున్నాడన్నది ఆసక్తికరంగా మారింది.
అయితే ఈ సినిమాలో అందరి దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షిస్తున్న అంశం కళ్యాణ్‌రామ్ క్యారెక్టర్. ఇటీవలి కాలంలో సీరియస్, ఇంటెన్స్ కథలను ఎంచుకుంటున్న ఆయన చాలా కాలం తర్వాత ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనింగ్ రోల్ లో కనిపించబోతున్నారు. అనిల్ రావిపూడి మొదటి సినిమా పటాస్(Patas) లో హీరోగా నటించిన కళ్యాణ్‌రామ్‌కు ఇప్పుడదే డైరెక్టర్ తో మరోసారి కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. ఈసారి వెంకటేష్ వంటి ఎంటర్టైన్మెంట్ స్టార్‌తో కలిసి ఆయన చేసే కామెడీ, కెమిస్ట్రీ ఎలా ఉంటుందన్నది సినిమాకు మెయిన్ ఎట్రాక్షన్ గా నిలవనుంది.
వెంకటేష్ కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే జనవరి 12 విడుదలలో వెంకటేష్‌తో కలిసి కళ్యాణ్‌రామ్ ఏ స్థాయిలో ఎంటర్టైన్మెంట్ పండిస్తారన్నదే ఇప్పుడు మెయిన్ డిస్కషన్ గా మారింది. 2027 జనవరి 12న థియేటర్లలోకి రానున్న ఈ సినిమాను సాహు గారపాటి(sahu garapati), సురేష్ ప్రొడక్షన్స్(Suresh productions), జీ స్టూడియోస్(Zee studios) సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్(GV Prakash kumar) మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాతో సంక్రాంతి సీజన్లో అనిల్ మరోసారి తన మార్క్‌ను చూపించేందుకు సిద్ధమవుతున్నాడు.








