తొంగి తొంగి చూడమాకు టీజర్ విడుదల
దిలీప్, శ్రావణి జంటగా నటించిన చిత్రం తొంగి తొంగి చూడమాకు. ఆనంద్ కానుమోలు దర్శకుడు. ఎ.సునీత మోహన్ రెడ్డి నిర్మాత. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా టీజర్‌ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ కోరుకున్న అమ్మాయిని దక్కించుకోవాలంటే ముందు ఆ అమ్మాయి మనసు గెలుచుకోవాలని చెప్పే చిత్రమిది. ప్రేమలోని గొప్పదనాన్ని చెబుతుంది. తప్పకుండా ప్రేక్షకుల్ని మెప్పిస్తాం అన్నారు. కథానాయకుడు మాట్లాడుతూ యువతరానికి ప్రతినిధిగా తెరపై కనిపిస్తా అన్నారు. హీరోతో సమానంగా కనిపించే ప్రతినాయక పాత్రని పోషిస్తున్నట్టు నటుడు రాజ్ తెలిపారు. కథని, దర్శకుడు ఆలోచనల్ని నమ్మి నిర్మించాం. ఈ నెలాఖరునగానీ వచ్చే నెల మొదటివారంలో కానీ విడుదల చేస్తామన్నారు నిర్మాత.













