ఈ వీకెండ్ సినిమాల అసలైన సర్ప్రైజ్లు వీళ్లే!
తెలుగు రాష్ట్రాల్లో ఈ వీకెండ్ ఆడియన్స్ ముందుకొచ్చిన ENE రిపీట్ , ఆకాశంలో ఒక తార(aakasam lo oka taara) సినిమాలు మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటున్నాయి. భిన్నమైన ప్రేక్షక వర్గాలను ఆకట్టుకుంటూ ఈ రెండు సినిమాలు థియేటర్లలో సందడి చేస్తున్నాయి. ENE రిపీట్‌కు యూత్ నుంచి ఆదరణ లభిస్తుండగా, ఆకాశంలో ఒక తార ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్లకు రప్పిస్తోంది. ఈ క్రమంలో రెండు సినిమాల్లోనూ ఊహించని విధంగా మెప్పించిన నటీనటులు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు.
ENE రిపీట్‌లో అభినవ్ గోమటం(Abhinav gomatam) తనదైన కామెడీ టైమింగ్‌తో ఆడియన్స్‌ను విశేషంగా ఆకట్టుకున్నారు. నలుగురు యువ నటులు కీలకంగా కనిపించిన ఈ సినిమాలో అభినవ్ తన నేచురల్ యాక్టింగ్ తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయనపై ఉన్న అంచనాలను మించి ఎంటర్టైన్మెంట్ ను పంచుతూ సినిమాకు మెయిన్ ఎట్రాక్షన్ గా నిలిచారు. ముఖ్యంగా ఆయన పండించిన హాస్యం యూత్ ఆడియన్స్‌ను బాగా అలరిస్తోంది.
ఇవి కూడా చదవండి
ఇక ఆకాశంలో ఒక తార సినిమాలో శృతి హాసన్(Shruti hasan) అనూహ్యమైన సర్ప్రైజ్గా నిలిచారు. దుల్కర్ సల్మాన్(Dulquer salman), సాత్విక(Satvika) తమ పాత్రల్లో చక్కగా నటించినప్పటికీ, శృతి హాసన్‌కు లభించిన ప్రాధాన్యత, యాక్టింగ్ కు ఉన్న అవకాశం ఆమె టాలెంట్ ను మరోసారి చాటాయి. తన క్యారెక్టర్ కు పూర్తి న్యాయం చేస్తూ ఆడియన్స్ ప్రశంసలు అందుకుంటున్నారు. మొత్తంగా ఈ వీకెండ్ లో అభినవ్ గోమటం, శృతి హాసన్ తమ సినిమాల ద్వారా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచి సర్ప్రైజ్ ప్యాకేజీలుగా మారారు.







