The Paradise: ది ప్యారడైజ్ భారీగా పెరిగిపోతున్న బడ్జెట్
నేచురల్ స్టార్ నాని(nani) హీరోగా తెరకెక్కుతున్న తాజా సినిమా ది ప్యారడైజ్(the paradise). దసరా(Dasara) ఫేమ్ శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఆల్రెడీ వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ది ప్యారడైజ్ సినిమా సూపర్ హిట్ అవడంతో ఇప్పుడీ సినిమాపై అందరికీ మంచి అంచనాలున్నాయి. దానికి తగ్గట్టే సినిమా నుంచి రిలీజైన కంటెంట్ కూడా మూవీపై భారీ బజ్ ను క్రియేట్ చేస్తుంది.
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా మార్చి 26న రిలీజ్ కానుందని మేకర్స్ మొదట్లోనే అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు షూటింగ్ ఇంకా అవకపోవడంతో ది ప్యారడైజ్ వాయిదా పడుతుందని తెలుస్తోంది. వీలైనంత త్వరగా షూటింగ్ ను పూర్తి చేసి జూన్ లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ఓ అప్డేట్ తెలుస్తోంది.
ది ప్యారడైజ్ బడ్జెట్ ఇప్పటికే రూ.200 కోట్లు దాటిందని సమాచారం. నాని కెరీర్లోనే ఇది హయ్యెస్ట్ బడ్జెట్ సినిమా అని అంటున్నారు. అంతేకాదు, షూటింగ్ పూర్తై, సినిమా రిలీజయ్యే నాటికి ఆ బడ్జెట్ మరింత పెరిగే అవకాశముందని టాక్. అయితే అంత బడ్జెట్ పెరగడంతో తిరిగి రికవరీ టైమ్ లో సమస్యగా మారడం ఖాయం. మరి మేకర్స్ ఈ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో చూడాలి.






