Vishwambhara: అందుకే విశ్వంభర లేటవుతోంది
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi) రీసెంట్ గా సంక్రాంతికి మన శంకరవరప్రసాద్ గారు (MSG) మూవీతో బ్లాక్ బస్టర్ ను అందుకున్న సంగతి తెలిసిందే. త్వరలోనే బాబీ (Bobby)తో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్న చిరూ(chiru), ఇప్పటికే వశిష్ట(Vasishta) దర్శకత్వంలో విశ్వంభర(Vishwambhara) అనే సినిమాను పూర్తి చేశారు. ఈ సినిమా సోషియా ఫాంటసీ డ్రామాగా తెరకెక్కింది.
విశ్వంభర షూటింగ్ ఎప్పుడో పూర్తైనా, ఇప్పటికీ ఈ సినిమా రిలీజవలేదు. దీంతో ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజవుతుందా అని అందరూ ఎంతో ఆతృతగా ఉన్నారు. ఇదిలా ఉంటే రీసెంట్ గా ఓ మూవీ ఈవెంట్ కు హాజరైన యువీ క్రియేషన్స్ అజయ్ కుమార్(Ajay kumar) ఈ మూవీ గురించి మాట్లాడారు. విశ్వంభర టీజర్ కు మంచి రెస్పాన్స్ రాకపోవడంతో సెకండ్ టీజర్ లో వీఎఫ్ఎక్స్ పై దృష్టి పెట్టామన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
విశ్వంభర చిన్న సినిమా కాదని, చాలా భారీ మూవీ అని, అందుకే సీజీ కోసం టైమ్ పడుతుందని చెప్పారు. త్రిష(Trisha) హీరోయిన్ గా నటించిన ఈ మూవీకి ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి (keeravani) సంగీతం అందిస్తుండగా, యువి క్రియేషన్స్ (UV Creations) భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. కాగా ఈ సినిమాను సమ్మర్ లో కచ్ఛితంగా రిలీజ్ చేస్తానని చిరూ ఆడియన్స్ కు మాటిచ్చిన విషయం తెలిసిందే.




