మహేష్ కెరీర్లోనే ఫస్ట్ టైమ్ ఆ పాత్రలో!
మహేష్ నుంచి చివరిగా వచ్చిన సర్కారు వారి పాట సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్న రేంజ్లో ఆడకపోవడంతో మహేష్ నుంచి కొత్త సినిమా ఎప్పుడెప్పుడొస్తుందా అని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఫ్యాన్స్ వెయిటింగ్ కు తగ్గట్లే మహేష్, త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న గుంటూరు కారం సినిమా అనేక కారణాల వల్ల లేటవుతూ వచ్చింది.
వాస్తవానికి గుంటూరు కారం సినిమా ఈ ఏడాదే రిలీజ్ కావాల్సింది కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ రిలీజ్ లేటయింది. ఎట్టకేలకు వచ్చే సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత మహేష్ రాజమౌళితో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా పూర్తవడానికి ఎంత లేదన్నా మూడేళ్లు పడుతుంది.
ఆ తర్వాత మహేష్ చేయనున్న సినిమాలో ఇప్పటివరకు తను చేయని ఓ కొత్త పాత్రలో ఆడియన్స్ ను అలరించనున్నాడట. ఇప్పటివరకు మహేష్ క్లాస్, మాస్, కౌబాయ్ క్యారెక్టర్లు చేశాడు కానీ ఈసారి మాత్రం మహేష్ గ్యాంగ్స్టర్ గా కనిపించనున్నాడట. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో మహేష్ చేయనున్న సినిమాలో మహేష్ గ్యాంగ్స్టర్ పాత్రలో అలరించనున్నట్లు స్వయంగా సందీపే చెప్పాడు. ఈ క్యారెక్టర్ ఫ్యాన్స్ కు ఐ ఫీస్ట్ లా ఉంటుందని కూడా సందీప్ వివరించాడు. ఈ సినిమా తెరకెక్కడానికి టైం పట్టినా ఈ వార్త మాత్రం వినడానికి చాలా బాగుందని ఫ్యాన్స్ తెగ ఖుషీ అయిపోతున్నారు.













