బేబీ బంప్‌తో ప్రెగ్నెన్సీ గ్లో తో మెరిసిపోతున్న సామ్
ఏ మాయ చేసావే(Ye maaya chesave) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సమంత, తక్కువ టైమ్ లోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ప్రస్తుతం మాతృత్వాన్ని ఎంజాయ్ చేస్తూ లైఫ్ లో కొత్త ఫేజ్ లోకి అడుగుపెడుతున్న సమంత(Samantha) తాజాగా బేబీ బంప్ ఫోటోలతో ఫాలోవర్లను ఆకట్టుకుంటుంది. ఈ ఫోటోల్లో సమంత బ్లాక్ కలర్ ఫ్లేర్ మినీ ఫ్రాక్ టైప్ డ్రెస్ ధరించిన ఆమె, దానికి కాంబినేషన్ లో బ్లాక్ కలర్ ప్యాంట్ ధరించింది. దీనికి మ్యాచింగ్ గా బ్లాక్ కలర్ కోట్ వేసుకుని ఫ్యాషన్ గా కనిపిస్తూనే సింపుల్ గా అలరించింది. సమంత ప్రెగ్నెన్సీ గ్లో తో మెరిసిపోతుందంటూ నెటిజన్లు ఆ ఫోటోలకు కామెంట్ల వర్షం కురిపిస్తూ, వాటిని నెట్టింట వైరల్ చేస్తున్నారు.








