మాధవి కోసం నరేష్ గారు, మురళీ మోహన్ గారు రూ. 50 వేల చొప్పన విరాళం అందించారు – ‘మా’ ట్రెజరర్ శివ బాలాజీ
స్వర్గీయ పావలా శ్యామల గారి కూతురు మాధవిని రమణాచారి ఫౌండేషన్‌లో జాయిన్ చేస్తున్నామని ‘మా (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్)’ ట్రెజరర్ శివ బాలాజీ తెలిపారు. ఆమె సంక్షేమం కోసం సీనియర్ నటుడు నరేష్, మురళీ మోహన్ తదితరులు యాభై వేల చొప్పున ఆర్థిక విరాళాన్ని అందించారు. ఆమె సంక్షేమాన్ని ‘మా’ చూసుకుంటుందని అన్నారు. ఈ మేరకు నిర్వహించిన మీడియా సమావేశంలో ‘మా’ ఈసీ మెంబర్స్, జనరల్ సెక్రటరీ కరాటే కళ్యాణీ, ట్రెజరర్ శివ బాలాజీ మాట్లాడారు.
ఈ మీడియా సమావేశంలో ట్రెజరర్ శివ బాలాజీ మాట్లాడుతూ .. ‘‘పావలా శ్యామల గారు ‘మా’లో జాయిన్ అయినప్పటి నుంచీ ఆమెకి ఫించన్ ఇస్తూ వచ్చాం. గతంలో పవన్ కళ్యాణ్ గారు లక్ష రూపాయాలు ఇచ్చారు. 2019లో ఈ ఇష్యూని చిరంజీవి గారి వద్దకు తీసుకు వెళ్లారు. ఆయన ఇచ్చిన ఫండ్ కాకుండా మెంబర్‌షిప్‌ను ఫ్రీగా ఇప్పించారు. ఆమె ఏ ఇష్యూ వచ్చిన మీడియా ముందుకు వచ్చేవారు. ఏ ఆశ్రమంలో పెట్టినా ఆమె ఉండేది కాదు. మహా ప్రస్థానంలో ఆమె అంత్యక్రియలు ఘనంగా నిర్వహించాం. పావలా శ్యామల గారి కూతురు మాధవి గారిని కూడా మేం చూసుకుంటామని ‘మా’ పెద్దలు మాటిచ్చారు. కానీ ఆమె ‘మా’ మెంబర్ కాదు. ‘మా’ ఫండ్‌ని వాడలేం. అందుకే గత నెల రోజులుగా ఈ విషయం మీదే మేం చర్చించుకున్నాం. మానిక్ గారు రమణాచారి ఫౌండేషన్‌తో మాట్లాడారు. ఫుడ్డు, బెడ్డు, ఫిజియో థెరపీ ఆయనే చూసుకుంటామని చెప్పారు. కేర్ టేకర్‌ని మాత్రం మేం నియమించాం. ‘మా’ అసోసియేషన్ ఫండ్‌ని మాత్రం వృథా చేయడం లేదు. చాలా మంది సాయం చేస్తామని ఫోన్స్ చేస్తున్నారు. అలా ఇవ్వాలని అనుకునే వారు ‘మా’కి విరాళం ఇవ్వండి. మేం ఆ ఫండ్‌ని మాధవి గారి కోసం వాడతాం. ఇప్పటికే నరేష్ గారు, మురళీ మోహన్ గారు రూ. 50 వేల చొప్పన విరాళం అందించారు’ అని అన్నారు.
జాయింట్ సెక్రటరీ కళ్యాణీ మాట్లాడుతూ .. ‘పావలా శ్యామలా గారిని ‘మా’ ఎప్పుడూ విస్మరించలేదు. ఆమెకు అండగా నిలుస్తూనే వచ్చాం. మా మీద విమర్శలు చేసే వారు ఒక్క రోజు ఆమెని ఇంట్లో పెట్టుకుని సేవలు చేస్తే బాగుండేది. మాటలు వదలడం తేలిక. సహాయం చేయడం కష్టం. మా విష్ణు బాబు ఆధ్వర్యంలోనే అన్ని కార్యక్రమాల్ని విజయవంతంగా నిర్వహించాం. ఆమె అంత్యక్రియల్ని కూడా ఘనంగా నిర్వహించాం. పావలా శ్యామల గారి కూతురు మాధవిని కూడా మేమే చూసుకుంటున్నాం. ఆమె కాళ్ల మీద ఆమె నిలబడేలా చేయాలన్నదే ‘మా’ లక్ష్యం. మానిక్ అన్న, నేను కలిసి రమణాచారి గారిని ఆశ్రయించాం. కేర్ టేకర్‌ని పెట్టి రమణాచారి గారి ఫౌండేషన్‌లో మాధవిని ‘మా’ చూసుకుంటోంది.‘మా’ మీద బురదజల్లకండి. విమర్శించేవారంతా కూడా సాయం చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
ఈసీ మెంబర్ వడ్లపట్ల మాట్లాడుతూ .. ‘పావలా శ్యామల గారు మెంబర్ అయినప్పటి నుంచీ ఆమెకు ఫించన్ ఇస్తున్నాం. ఆమెకు ఎప్పుడూ అండగానే ఉంటూ వచ్చాం. ఆమె అస్తికల్ని కాశీలో కలిపేందుకు కూడా ముందుకు వచ్చారు. ‘మా’ మీద కాంట్రవర్సీ మాత్రమే కాకుండా ‘మా’ చేస్తున్న మంచి పనుల్ని కూడా చూపించండి’ అని అన్నారు.
ఈసీ మెంబర్ మానిక్ మాట్లాడుతూ .. ‘‘పావలా శ్యామల గారిని ‘మా’ ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. కానీ ‘మా’ మీద చాలా మంది బురదజల్లాలని చూశారు. మాట్లాడేవాళ్లు, మాటలు వదిలేసే వాళ్లు ముందుకు వచ్చి సాయం చేయాలని కోరుకుంటున్నాను. పావలా శ్యామల గారి కూతురు మాధవి బాధ్యతను రమణాచారి గారి ఫౌండేషన్ తీసుకుంది. మాధవిని మా బిడ్డలా ‘మా’ చూసుకుంటుంది. మేమంతా కలిసి రమణాచారి గారిని కలిసి పరిస్థితిని వివరించాం. ఆయనే అంతా చూసుకున్నారు. ఆనంద నిలయంలో ఆమెకు కావాల్సినవన్నీ చేసి పెడుతున్నారు. సొంత బిడ్డలా చూసుకుంటామని అన్నారు.
ఈసీ మెంబర్ శశాంక్ మాట్లాడుతూ .. ‘పావలా శ్యామల గారు మన ఇండస్ట్రీలో ఉండటం మన అదృష్టం. ‘మా’ లాంటి సంస్థ ఆమెకి ఎప్పుడూ అండగా నిలిచింది. మేమంతా ఒకే కుటుంబం అని చాటి చెబుతున్నాం. ఇప్పటికీ ఎంతో మంది ఆర్టిస్టులకు సాయమందించాం. మా విష్ణు బాబు ఆధ్వర్యంలో గత నాలుగేళ్లుగా ఎన్నో సహాయ కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం. ‘మా’ మీద విమర్శలు కాకుండా వీలైతే విలువైన సలహాల్ని, ఆర్థిక సాయాన్ని చేయండి’ అని అన్నారు.
మాధవి మాట్లాడుతూ ఇంతకు ముందు మా అమ్మని నన్ను మా అసోసియేషన్ చేయూతనిచ్చారు. ఇప్పుడు అదేవిధంగా విష్ణు గారు మెంబెర్స్ కూడా చూసుకున్నారు. అదే విధంగా నాకు కూడా చేయూతనివ్వాలని కోరుకుంటున్నాను . మీడియా వాళ్ళు నేను చెప్పని విషయాన్ని వక్రీకరించి రాయొద్దని నేను అభ్యర్ధిస్తున్నాను
డొనేషన్ ఇవ్వదలచుకున్న దాతలకు అకౌంట్ వివరాలు క్రింద ఇవ్వబడినవి
FOR DAUGHTER OF
PAVALA SHYAMALA (MADHAVI)
MOVIE ARTISTES’ ASSOCIATION
UNION BANK OF INDIA
FILM NAGAR – 3
ACCOUNT HOLDER : MOVIE ARTISTES’ ASSOCIATION (WELFARE ACCOUNT)
112210011002307
IFSC CODE : UBIN0910520
MICR CODE : 500026245
FOR ANY INFORMATION PLEASE CONTACT : 7799797702








