శ్రావణి ఆత్మహత్య.. నిందితుల అరెస్ట్
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన టీవీ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితులను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఏ 1 గా సాయికృష్ణ ని, ఏ 2 గా నిర్మాత అశోకరెడ్డి ని 3వ నిందితుడిగా దేవరాజ్ రెడ్డి లను పోలీసులు ఎఫ్ ఐ ఆర్ లో పేర్కొన్నారు. ఈకేసు వివరాలు పోలీసులు మీడియా కు వెల్లడించారు. గత కొంతకాలంగా సాయి తో శ్రావణి ప్రేమాయణం కొనసాగిస్తున్నట్లుగా పోలీసుల విచారణ లో వెల్లడైంది అయితే దేవరాజ్ పరిచయంతో శ్రావణి లో మార్పు వచ్చింది. తమ మధ్య దేవరాజ్ రావడం సాయి సహించలేక పోయాడు. పలుమార్లు ఈ విషయo లో ముగ్గురు గొడవలు పడ్డారు.
ఈ విషయం లో కుటుంబ సభ్యులు కూడా దేవరాజ్ తో సంభంధం వద్దంటూ శ్రావణి పై ఒత్తిడి తెచ్చారు. మరోవైపు అశోకరెడ్డి తో కూడా శ్రావణి సాన్నిహిత్యం నెరపింది. ఆత్మహత్య చేసుకునే ముందుగా కూడా శ్రావణి దేవరాజ్ తో చాలా సేపు ఫోన్లో మాట్లాడింది అయితే ఎక్కడా దేవరాజ్ ని తప్పుబట్టలేదు. జరిగిన సంఘటనల క్రమాన్ని పరిశీలించిన తర్వాత శ్రావణి ఆత్మహత్య కు ఆమె ముగ్గురు మగ స్నేహితులు కారణంగా భావించి కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆర్ ఎక్స్ 100 సినిమా నిర్మాత ఆశోక్ రెడ్డి పరారీలో ఉన్నాడని చెప్పారు.













