క్రేజీ ప్రాజెక్టును పట్టేసిన ప్రదీప్
తమిళ సినీ పరిశ్రమలో వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ యాక్టర్ ప్రదీప్ రంగనాథన్(pradeep ranganathan)కు మరో క్రేజీ ప్రాజెక్ట్ దక్కబోతున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో డైరెక్టర్ గా బిజీగా ఉన్న అట్లీ(Atlee), నిర్మాతగా ఓ ఆసక్తికరమైన సినిమాను తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో హీరోగా ప్రదీప్ రంగనాథన్ నటించనున్నాడని, ఇప్పటికే ప్రారంభ స్థాయి చర్చలు సానుకూలంగా పూర్తయ్యాయని తెలుస్తోంది. వచ్చే ఏడాది ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని టాక్ వినిపిస్తోంది.
ఈ ప్రాజెక్ట్‌కు అట్లీ శిష్యుల్లో ఒకరు దర్శకత్వ బాధ్యతలు చేపట్టనున్నారని, అట్లీ మాత్రం నిర్మాతగా వ్యవహరించనున్నారని కోలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం అల్లు అర్జున్(Allu arjun)తో రాకా(raaka) అనే భారీ పాన్ ఇండియా సినిమాను రూపొందిస్తున్న అట్లీ, ఒకవైపు ఆ భారీ ప్రాజెక్ట్ తో పాటూ యంగ్ టాలెంట్ ను ప్రోత్సహించే దిశగా కూడా అడుగులు వేస్తున్నట్లు ఈ వార్తల ద్వారా స్పష్టమవుతోంది. కథ, పాత్రల ఎంపిక విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న అట్లీ టీమ్, ప్రదీప్ ఇమేజ్‌కు సరిపోయే విధంగా ఈ సినిమాను డిజైన్ చేస్తున్నట్లు సమాచారం.
ఇక లవ్ టుడే(love today), డ్రాగన్(Dragon), డ్యూడ్(Dude) వంటి సినిమాలతో ప్రదీప్ రంగనాథన్ ప్రస్తుతం కోలీవుడ్ లో అత్యంత డిమాండ్ ఉన్న హీరోలలో ఒకరిగా మారిపోయాడు. వరుస హిట్లతో తన మార్కెట్‌ను పెంచుకున్న ప్రదీప్, రెమ్యూనరేషన్ ను కూడా భారీగా పెంచినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్(AGS Entertainment), మైత్రీ మూవీ మేకర్స్(mythri movie makers) వంటి ప్రముఖ నిర్మాణ సంస్థలతో కమిట్మెంట్లు ఉన్న అతడు, త్వరలో డైరక్టర్ గానూ మరోసారి మెగాఫోన్ పట్టేందుకు సిద్ధమవుతున్నాడు. అట్లీ- ప్రదీప్ కాంబినేషన్‌పై అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది.








