థియేటర్లలో జడల్ జమానా షురూ.. ప్యారడైజ్ గురించి అనిరుధ్ ప్రామిస్
నేచురల్ స్టార్ నాని(nani) హీరోగా శ్రీకాంత్ ఓదెల(Srikanth odela) తెరకెక్కించిన ది ప్యారడైజ్(the paradise) పై రిలీజ్ కు ముందే అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానున్న ఈ సినిమాకు ఒక రోజు ముందుగానే సెప్టెంబర్ 23న ప్రీమియర్లు ప్లాన్ చేశారు. ఈ నేపథ్యంలో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్(anirudh ravichander) పంపిన స్పెషల్ వీడియో బైట్ ఇప్పుడు సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. ఈ సినిమా తనకు అత్యంత ప్రత్యేకమైనదని చెప్పిన అనిరుధ్.. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో ఏర్పడిన బాండింగ్ ను ప్రత్యేకంగా ప్రస్తావించారు. సినిమా జర్నీలో అతడు తనకు బ్రదర్ లాగా మారిపోయాడని అనిరుధ్ చెప్పడం విశేషం.
ది ప్యారడైజ్ లో నాని పోషించిన పాత్రపై అనిరుధ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు మెయిన్ ఎట్రాక్షన్ గా మారాయి. మాస్ ఎలిమెంట్స్‌తో కూడిన ఈ క్యారెక్టర్ కు నాని తన ఎనర్జీ, పెర్ఫార్మెన్స్తో నెక్ట్స్ లెవెల్ ను తీసుకొచ్చారని ఆయన ప్రశంసించారు. ఆల్రెడీ సినిమాను చూసిన అనిరుధ్.. నాని యాక్టింగ్ వెనుక ఉన్న శ్రమను దగ్గరగా గమనించినట్లు తెలిపారు. అదే సమయంలో ఇతర నటీనటులపైనా ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా మోహన్‌బాబు, రాఘవ్ జుయల్ తమ యాక్టింగ్ తో తనను ఆకట్టుకున్నారని పేర్కొన్నారు. దీంతో సినిమాలో పాత్రల ప్రాధాన్యతపై కూడా ఆసక్తి నెలకొంది.
ఇవి కూడా చదవండి
మరోవైపు నాని, అనిరుధ్ కాంబినేషన్‌పై కూడా ఆయన చేసిన కామెంట్స్ ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని పెంచుతున్నాయి. ఈ ఇద్దరి కాంబినేషన్‌కు ది ప్యారడైజ్ హ్యాట్రిక్ సక్సెస్ ను అందిస్తుందనే నమ్మకాన్ని అనిరుధ్ వ్యక్తం చేశారు. అంతేకాదు, సినిమా రిలీజ్ తర్వాత థియేటర్లలో జడల్ జమానా మొదలవుతుందని ఆయన చెప్పడంతో మాస్ ట్రీట్‌పై అంచనాలు మరింత పెరిగాయి. దీంతో సెప్టెంబర్ 24న థియేటర్లలో ది ప్యారడైజ్ ఎలాంటి ప్రభావం చూపించనుందనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. సుధాకర్ చెరుకూరి(sudhakar cherukuri) భారీ స్థాయిలో ఈ సినిమాను నిర్మించిన విషయం తెలిసిందే.








