Viswambhara: ఆట కావాలా కాదు, రగులుతోంది మొగలిపొద
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), వశిష్ట(Vassishta) కలయికలో తెరకెక్కుతున్న సోషియో ఫాంటసీ డ్రామా విశ్వంభర(Viswambhara). యువి క్రియేషన్స్(UV Creations) భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఎన్నో అంచనాలతో మొదలైంది కానీ ఎప్పుడైతే టీజర్ వచ్చిందో అందులోని వీఎఫ్ఎక్స్ వల్ల సినిమాపై చాలా విమర్శలొచ్చాయి. దీంతో వీఎఫ్ఎక్స్ టీమ్ ను మార్చిన టీమ్ ఆ పనుల్లో బిజీగా ఉంది.
ఇప్పటికే విశ్వంభర సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తైంది. అయితే విశ్వంభరలో ఓ స్పెషల్ సాంగ్ ఉందని, ఆ సాంగ్ కు సంబంధించిన షూటింగ్ మాత్రం ఇంకా పెండింగ్ లోనే ఉందని కొన్నాళ్లుగా వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. ఈ స్పెషల్ సాంగ్ చిరంజీవి హిట్ సినిమా అన్నయ్య(Annayya)లోని ఆట కావాలా పాట కావాలా(Aata Kavala Pata kavala) కు రీమిక్స్ వెర్షన్ అని కూడా వార్తలొచ్చాయి.
కానీ విశ్వంభరలోని స్పెషల్ సాంగ్ అన్నయ్య మూవీలోనిది కాదని, ఖైదీ(Khaidhi)లోని రగులుతోంది మొగలిపొద(Raguluthondi Mogalipoda) సాంగ్ కు రీమిక్స్ అని ఇప్పుడు కొత్తగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ స్పెషల్ సాంగ్ ను కీరవాణి(Keeravani) కంపోజ్ చేయడం లేదని, భీమ్స్ సిసిరోలియో(Bheems Ciciroleo) ఈ స్పెషల్ సాంగ్ బాధ్యతల్ని తీసుకున్నారని, ఈ స్పెషల్ సాంగ్ లో బాలీవుడ్ బ్యూటీ మౌనీ రాయ్(Mouni Roy) చిరూతో కలిసి స్టెప్పులేయనుందని అంటున్నారు. ఈ వార్తల్లో క్లారిటీ రావాలంటే మాత్రం చిత్ర యూనిట్ నుంచి క్లారిటీ రావాల్సిందే.







