Keerthy Suresh: కీర్తి ఈసారైనా హిట్ కొడుతుందా?
సౌత్ ఇండస్ట్రీలో తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ కీర్తి సురేష్(Keerthy suresh) రీసెంట్ గా హిందీ సినిమా రంగంలోకి కూడా అడుగుపెట్టిన విషయం తెలిసిందే. తెలుగు, తమిళ్ సహా పలు భాషల్లో సక్సెస్ఫుల్ సినిమాలు చేసిన ఆమె బాలీవుడ్లో బేబీ జాన్(Baby John) అనే యాక్షన్ డ్రామాతో గ్లామరస్ ఎంట్రీ ఇచ్చింది. అయితే భారీ అంచనాల మధ్య విడుదలైన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేక పోయింది. దీంతో కీర్తి సురేష్‌కు బాలీవుడ్లో అవకాశాలు తగ్గిపోతాయా అనే చర్చ కూడా అప్పట్లో సినీ వర్గాల్లో వినిపించింది.
అయితే ఆ సందేహాలకు తెరదించేలా కీర్తి సురేష్ మరో హిందీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. టాలెంటెడ్ నటుడు రాజ్ కుమార్ రావు(Raj Kumar Rao) హీరోగా, కీర్తి సురేష్ హీరోయిన్గా నటించిన తాజా సినిమా రాఫ్తార్(Raftar) ప్రస్తుతం విడుదలకు రెడీ అవుతోంది. ఈ సినిమాను డైరెక్టర్ ఆదిత్య నింబల్కర్(Aditya Nimbalkar) తెరకెక్కించగా, మేకర్స్ అధికారికంగా ఈ సినిమాను ఈ ఏడాది జూలై 24న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటనతో సినిమాపై బాలీవుడ్ వర్గాల్లో మంచి ఆసక్తి నెలకొంది.
ఇక ఈ సినిమాలో మరో టాలెంటెడ్ నటి తన్యా మణిక్తలా(Tanya Manikthala) కీలక పాత్రలో కనిపించనుంది. యాక్షన్ మరియు ఎమోషన్ మేళవింపుతో రూపొందుతున్న ఈ సినిమాను అమెజాన్ ఎంజిఎం(Amazon MGM) స్టూడియోస్‌తో పాటు ఏ కంపా ఫిల్మ్స్(A Campa Films) నిర్మిస్తున్నాయి. మరి ఈ సినిమాతో అయినా కీర్తి సురేష్ బాలీవుడ్లో తన తొలి హిట్‌ను నమోదు చేసుకుంటుందా అనే విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రిలీజ్ అనంతరం ఈ సినిమా ఎలా స్పందన అందుకుంటుందో చూడాలి.








