జైలర్2 అసలు పరీక్ష ఇప్పుడే మొదలు!
సూపర్‌స్టార్ రజనీకాంత్(rajinikanth) ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ ప్రాజెక్టుల్లో జైలర్2 (jailer2) ఒకటి. నెల్సన్ దిలీప్‌కుమార్(nelson dileep kumar) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సీక్వెల్ అక్టోబర్ 15న థియేటర్లలోకి రానుంది. జైలర్(jailer) సాధించిన సక్సెస్ తో ఈ మూవీపై మామూలుగానే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఇప్పటివరకు రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ మాత్రం ఆ స్థాయి బజ్‌ను క్రియేట్ చేయలేకపోయిందనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా అనిరుధ్(anirudh) అందించిన రెండు సాంగ్స్ ఆడియన్స్ ను పెద్దగా ఆకట్టుకోలేదు.
ఇక తెలుగులో జైలర్2ను మరింత భారీగా రిలీజ్ చేసేందుకు సితార ఎంటర్టైన్మెంట్స్(sithara entertainments) అధినేత ఎస్. నాగవంశీ(S. Nagavamsi) రంగంలోకి దిగారు. ఈ సినిమా తెలుగు థియేట్రికల్ రైట్స్ ను ఆయన భారీ మొత్తానికి సొంతం చేసుకున్నట్లు సమాచారం. దసరా సీజన్ ఈ సినిమాకు కలిసొచ్చే అంశంగా మారనుంది. పండుగ సెలవులతో పాటు జైలర్ సీక్వెల్ కావడం కూడా ఓపెనింగ్స్‌కు ప్లస్ పాయింట్‌గా నిలిచే అవకాశం ఉంది.
అయితే ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించే అసలు బాధ్యత ఇకపై ట్రైలర్‌పైనే ఉంది. రజనీకాంత్ మాస్ ఇమేజ్‌కు తగ్గ ఎలివేషన్స్‌తో పాటు కథపై ఆసక్తిని పెంచే కంటెంట్‌ను మేకర్స్ చూపించాల్సి ఉంది. ప్రస్తుతం అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌పై దృష్టి పెట్టారు. సన్ పిక్చర్స్(Sun Pictures) నిర్మిస్తున్న ఈ సినిమాకు రాబోయే ప్రమోషన్స్ కీలకంగా మారనున్నాయి.








