Varanasi: వారణాసి ప్రమోషన్స్ కోసం భారీ బడ్జెట్
రాజమౌళి(rajamouli) గురించి తెలియని వారు లేరంటే అతిశయోక్తి లేదు. కేవలం తెలుగు సినిమా ఆడియన్స్ కు మాత్రమే కాకుండా యావత్ భారతదేశంలో ఉన్న వారందరికీ ఆయన సుపరిచితులే. ఆయన్నుంచి సినిమా వస్తుందంటే దాని కోసం అందరూ ఎదురుచూస్తుంటారనే విషయం తెలిసిందే. అలాంటి రాజమౌళి ఇప్పుడు డిఫరెంట్ స్ట్రాటజీని ఫాలో అవుతున్నట్టు తెలుస్తోంది.
ఆర్ఆర్ఆర్(RRR) తో ఎన్నో రికార్డులను సృష్టించిన రాజమౌళి ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు(mahesh babu) హీరోగా వారణాసి(varanasi) అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఫారెస్ట్ అడ్వెంచర్ మూవీగా ఈ సినిమాను జక్కన్న పాన్ వరల్డ్ మూవీలో రూపొందిస్తున్నాడు. ఈ సినిమా కోసం రాజమౌళి చాలా డిఫరెంట్ ప్రమోషన్స్ ను ప్లాన్ చేస్తున్నట్టు ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి.
మామూలుగా ప్రమోషన్స్ కోసం పెద్దగా ఖర్చు పెట్టని రాజమౌళి ఈసారి వారణాసి సినిమా కోసం దాదాపు రూ.80 కోట్లను ఖర్చు పెట్టనున్నారని తెలుస్తోంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా నేషనల్, ఇంటర్నేషనల్ స్థాయిలో జక్కన్న వారణాసిని ప్రమోట్ చేయనున్నారని, దాని కోసమే ఇంత పెద్ద మొత్తంలో బడ్జెట్ ను కేటాయించనున్నారని అంటున్నారు. చూడాలి మరి జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నారో? ప్రియాంక చోప్రా(priyanka chopra), పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj sukumaran) ప్రధాన పాత్రల్లో నటించనున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 7న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.






