క్రేజీ ఆఫర్ పట్టేసిన గోపీచంద్ మలినేని
తంతే వెళ్లి బూరెలో పడ్డట్టయింది ఇప్పుడు డైరెక్టర్ గోపీచంద్ మలినేని సిట్యుయేషన్. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో అనౌన్స్ చేసిన సినిమా అర్థాంతరంగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడిందని గత కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.
అయితే ఇప్పుడు ఈ ప్లేస్ లో రవితేజ బదులు మరో సీనియర్ హీరోతో ఆ సినిమాను తెరకెక్కించనుందట మైత్రీ మూవీ మేకర్స్. ఈ సినిమా తమిళ స్టార్ హీరో అజిత్ తో తీయబోతున్నారట. మైత్రీతో అజిత్ ఓ సినిమాకు కమిట్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాకు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో అని వార్తలొచ్చాయి.
కానీ ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం, అజిత్‌తో మైత్రీ మూవీ చేయబోయే సినిమాకు గోపీచంద్ మలినేని పేరు వినిపిస్తోంది. గోపీ రెడీ చేసిన స్క్రిప్ట్ చాలా పవర్ఫుల్ గా ఉండటంతో ఇది మీడియం రేంజ్ హీరోతోనో, తక్కువ వయసున్న హీరోతోనో చేస్తే వర్కవుట్ కాదని అజిత్ ను ఒప్పించుకున్నారని టాక్. ఈ వార్తల్లో ఎంత నిజమున్నది తెలియదు కానీ ఇదే నిజమైతే గోపీచంద్ కు నక్క తోక తొక్కినట్లే. అజిత్ తో చేసే సినిమా హిట్ అయితే మాత్రం గోపీచంద్‌కు కోలీవుడ్ నుంచి కూడా ఆఫర్లు వచ్చే అవకాశముంది.













