దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’ ఆగస్టు 20న వరల్డ్‌వైడ్ రిలీజ్
దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న భారీ బడ్జెట్ ఫాంటసీ థ్రిల్లర్ ‘ఐ యామ్ గేమ్’ నుంచి ఫస్ట్ సింగిల్ విడుదలైంది. ఎవరే నువ్వే పేరుతో విడుదలైన ఈ పాటకు జేక్స్ బిజోయ్ సంగీతం అందించారు. అర్మాన్ మాలిక్ ఆలపించిన ఈ పాట తెలుగు వెర్షన్‌కు సనారే సాహిత్యం అందించారు. ఈ పాటను తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లోనూ ఈ పాటను విడుదల చేశారు.
తమిళ వెర్షన్‌కు విఘ్నేష్ రామకృష్ణ, హిందీ వెర్షన్‌కు నుమాన్ ఖోకర్, కన్నడ వెర్షన్‌కు హృదయ శివ సాహిత్యం అందించారు. కన్నడ వెర్షన్‌ను అనిరుద్ధ్ సుస్వరం ఆలపించారు. విడుదలైన వెంటనే ‘మళవిల్లాయే’ పాటకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. సోషల్ మీడియాలోనూ ఈ పాట వైరల్‌గా మారింది.
దుల్కర్ సల్మాన్ కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆగస్టు 20, 2026న ఓనం కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. దుల్కర్ సల్మాన్, జోమ్ వర్గీస్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ‘ఆర్డీఎక్స్’ ఫేమ్ నహాస్ హిదాయత్ తెరకెక్కిస్తున్నారు. సజీర్ బాబా, ఇస్మాయిల్ అబూబక్కర్, బిలాల్ మొయిదు స్క్రీన్‌ప్లే అందించారు.
ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు పాన్ ఇండియా స్థాయిలో అద్భుతమైన స్పందన వచ్చింది. అద్భుతమైన విజువల్స్, హై-వోల్టేజ్ యాక్షన్, థ్రిల్లింగ్ ఛేజ్ సీక్వెన్స్‌లతో ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. దుల్కర్ సల్మాన్ మెగా స్టైలిష్ మాస్ అవతార్‌లో కనిపించడం సినిమాపై అంచనాలను మరింత పెంచింది.
దక్షిణ భారతదేశంలోని 100కు పైగా లొకేషన్లలో చిత్రీకరించిన ఈ సినిమా మలయాళ సినీ పరిశ్రమలోనే భారీ స్థాయిలో తెరకెక్కిన చిత్రాల్లో ఒకటిగా నిలవనుంది. జిమ్షీ ఖాలిద్ సినిమాటోగ్రఫీ అందించగా, అన్బరివ్ మాస్టర్స్ యాక్షన్ కొరియోగ్రఫీ చేశారు. జేక్స్ బిజోయ్ సంగీతం, యాక్షన్, విజువల్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణలుగా నిలవనున్నాయి.
దుల్కర్ సల్మాన్ కెరీర్లో ఇది 40వ చిత్రం కావడం మరో ప్రత్యేకత. ఆంటోనీ వర్గీస్, తమిళ నటుడు-దర్శకుడు మిస్కిన్, కాయదు లోహర్, కతిర్, పార్థ్ తివారీ, సంయుక్త విశ్వనాథన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జీ మ్యూజిక్ ఈ చిత్రం మ్యూజిక్ రైట్స్‌ను సొంతం చేసుకుంది.
‘లోకః వంటి భారీ విజయాన్ని అందుకున్న తర్వాత వే2ఫేర్ ఫిల్మ్స్ నుంచి వస్తున్న చిత్రం కావడం, ‘ఆర్డీఎక్స్’ తర్వాత నహాస్ హిదాయత్ తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ‘ఐ యామ్ గేమ్’పై అంచనాలు మరింత పెరిగాయి. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.








