రాకేష్ వర్రే “మాయలేడి” మూవీ టైటిల్ సాంగ్ ‘మాయలేడి..’ రిలీజ్
యంగ్ టాలెంటెడ్ హీరో, ప్యాషనేట్ ప్రొడ్యూసర్ రాకేష్ వర్రే చేస్తున్న కొత్త సినిమా “మాయలేడి”. ఈ సినిమాలో రాకేష్ వర్రే హీరోగా నటిస్తూ క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. రాకేష్ వర్రే గతంలో క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎవరికీ చెప్పొద్దు, పేకమేడలు వంటి కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్ నిర్మించి అందరి ప్రశంసలు పొందారు. ఇప్పుడు “మాయలేడి”తో మరో ఇంట్రెస్టింగ్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సినిమాను దర్శకుడు ప్రశంకర్ రూపొందిస్తున్నారు. మధుమిత సర్కార్ హీరోయిన్ గా నటిస్తోంది. త్వరలోనే “మాయలేడి” సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
ఈ రోజు “మాయలేడి” సినిమా నుంచి మేకర్స్ టైటిల్ సాంగ్ ‘మాయలేడి..’ రిలీజ్ చేశారు. విశాల్ చంద్రశేఖర్ కంపోజ్ చేసిన బ్యూటిఫుల్ ట్యూన్ కు కృష్ణకాంత్ ఆకట్టుకునే లిరిక్స్ అందించారు. సింగర్స్ అరవింద్ అనెస్ట్, శిబి శ్రీనివాసన్, వేలు, పిటీ విక్రమ్, దేవ్ మాత్యూ, కవిత ఇలంగో అంతే అందంగా పాడారు. ‘మాయలేడి..’ పాట ఎలా ఉందో చూస్తే – ‘మాయలేడి చెంగు చెంగున దూకెరా, మాయలేడి గుండె ఠక్కున దోచెరా, మిస్టరీతో మంత్రమేదో వేసే కొత్తబొమ్మ మార్చెనేమో నన్నే, పక్కనుంటే తానే నచ్చుతుంది ఏంటో తెలియదుగా, ఎవడు వీడు అపరిచితుడు, అయినవాడల్లే ఉన్నాడు, చదువుతాడు, కనులే చూస్తూ ఉంటాడు..’ అంటూ సాగే ఈ పాటను హీరో హీరోయిన్స్ మధ్య క్యూట్ లవ్ సాంగ్ గా చిత్రీకరించారు.
ఇటీవల రిలీజ్ చేసిన “మాయలేడి” సినిమా గ్లింప్స్ కు హ్యూజ్ రెస్పాన్స్ దక్కింది. ఒక ఇంట్రెస్టింగ్ బ్యాక్ డ్రాప్ తో సాగే లవ్ స్టోరీని థియేటర్స్ లో చూడబోతున్న ఫీల్ ను ప్రేక్షకుల్లో ఈ గ్లింప్స్ క్రియేట్ చేసింది. ‘మాయలేడి..’ సాంగ్ కూడా ఇన్ స్టంట్ గా హిట్ అయ్యేలా కనిపిస్తోంది.








