విశాఖపట్నం ఇనార్బిట్ మాల్లో సరికొత్తగా గ్రాండ్ సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వనున్న AAA సినిమాస్
ప్రీమియం సినిమా అనుభూతికి పేరుగాంచిన AAA సినిమాస్..విశాఖపట్నంలోని ఇనార్బిట్ మాల్లో గ్రాండ్‌గా ప్రారంభమైంది. అత్యాధునిక టెక్నాలజీ, వరల్డ్‌క్లాస్ సినిమా ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు ప్రీమియం హాస్పిటాలిటీని ఒకే చోట అందిస్తూ ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించేందుకు AAA సినిమాస్ సిద్ధమైంది.
ఈ AAA సినిమాస్ గ్రాండ్ లాంచ్ కార్యక్రమానికి వ్యాపార, సినీ పరిశ్రమలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. దీంతో విశాఖపట్నం ఎంటర్టైన్మెంట్ ల్యాండ్‌స్కేప్‌లో AAA సినిమాస్ మరో కొత్త ల్యాండ్‌మార్క్‌గా నిలిచింది. ఈ కార్యక్రమానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, ఏషియన్ సునీల్ నారంగ్, భారత్ నారంగ్, సిమ్రన్ నారంగ్, జ్యేష్ఠ్ నారంగ్, మురళీమోహన్, ఆర్కిటెక్ట్ ఎర్రన్న యెక్బోటే, నిర్మాత బన్నీ వాస్, విశాఖపట్నం నార్త్ ఎమ్మెల్యే పి. విష్ణుకుమార్ రాజు, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, విశాఖపట్నం డీసీపీ విజయ్ మణికంఠ, ఇనార్బిట్ మాల్స్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రోహిత్ గోపాలనీ, ఇనార్బిట్ మాల్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ చంద్రేష్ దఫ్తరీ, ఇనార్బిట్ మాల్స్ సీనియర్ జనరల్ మేనేజర్ ఆపరేషన్స్ లలిత్ ఓజా, డిస్ట్రిక్ట్ మూవీస్ బిజినెస్ హెడ్ లవీ దువా, నిర్మాత వంశీ నందిపాటి, వి.ఎల్. శ్రీధర్, వెంకట్ నారాయణ్ (బాబీ), సదానంద్ గౌడ్ తదితర ప్రముఖులు హాజరయ్యారు.
పలు రంగాలకు సంబంధించిన ప్రముఖులంతా ఒకే వేదికపైకి రావడంతో AAA సినిమాస్ గ్రాండ్ డెబ్యూ మరింత ఘనంగా, ప్రత్యేకంగా నిలిచింది. విశాఖపట్నం నగరానికి ఇది ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికిన సందర్భంగా దీన్ని ప్రముఖులు పేర్కొన్నారు.
విశాఖ AAA సినిమాస్ గ్రాండ్ లాంచ్ ఈవెంట్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఆయన వేడుకలో పాల్గొని ఈ కార్యక్రమానికి మరింత ఉత్సాహాన్ని, గ్రాండ్‌నెస్‌ను తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రేక్షకులతో మంచి అనుబంధం, ఎంతో క్రేజ్ ఉన్న స్టార్‌గా ఈ వేడుకలో అల్లు అర్జున్ పాల్గొనడం కార్యక్రమాన్ని మరింత ప్రత్యేకంగా, అందరికీ గుర్తుండిపోయేలా చేసిందనటంలో సందేహం లేదు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు మాట్లాడుతూ.. విశాఖపట్నంకు తన హృదయంలో ఎప్పుడూ ప్రత్యేక స్థానం కలిగి ఉంటుందని అన్నారు. ఇప్పుడు విశాఖ ప్రేక్షకులకు ఈ సరికొత్త సినిమా అనుభూతిని అందించగలగడం ఎంతో సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. గీతా ఆర్ట్స్ వ్యవస్థాపకులు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ..విశాఖలో AAA సినిమాస్ ప్రారంభమైన సందర్భంగా అభినందనలు తెలిపారు. AAA సినిమాస్ ప్రత్యేకమైన స్థాయి, వరల్డ్‌క్లాస్ సినిమా అనుభూతిని ఆయన ప్రశంసించారు.
ఈ సినిమా థియేటర్ విశాఖ నగరానికి ప్రత్యేకంగా నివాళి అర్పించేలా ఒక ప్రత్యేకతను ప్రతిబింబించేలా ఏర్పాటు చేసింది. నగరానికి ఉన్న ఘనమైన చరిత్రతో పాటు, భారత నౌకాదళంతో విశాఖకు ఉన్న అనుబంధాన్ని ప్రతిబింబించేలా దీన్ని రూపొందించారు. నేవీలో సేవలందిస్తున్న మహిళల ధైర్యం, శక్తి, సేవలకు గుర్తుగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాల్ ఆకట్టుకుంటోంది. విశాఖ నగర గుర్తింపును తీర్చిదిద్దిన ప్రజలు, వారి కథలకు గౌరవం తెలిపేలా ఈ ప్రదేశాన్ని రూపొందించారు.
AAA సినిమాస్‌లో మొత్తం 8 అత్యాధునిక స్క్రీన్లు ఉన్నాయి. మొత్తం 1,556 సీట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన ఈ మల్టీప్లెక్స్‌లో అధునాతన ప్రొజెక్షన్ టెక్నాలజీ, అద్భుతమైన సౌండ్, ప్రీమియం కంఫర్ట్‌ను అందిస్తున్నారు. ఇందులో 7 స్క్రీన్లలో బార్కో లేజర్ ప్రొజెక్షన్ సిస్టమ్స్‌ను ఉపయోగించగా, ఇండియాలోనే తొలిసారిగా ప్రత్యేకమైన లెడ్ ప్రొజెక్షన్ Q లగ్జన్ స్క్రీన్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. 70 అడుగుల వెడల్పు, 30 అడుగుల ఎత్తుతో ఆకట్టుకునే పరిమాణంలో ఉన్న Q లగ్జన్ స్క్రీన్ ప్రేక్షకులకు అద్భుతమైన లార్జ్ ఫార్మాట్ సినిమా అనుభూతిని అందిస్తుంది. ఇందులో 5 స్క్రీన్లలో డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్, 2 స్క్రీన్లలో 7.1 సరౌండ్ సౌండ్‌ను ఏర్పాటు చేశారు. ప్రతి సినిమా కథను ప్రేక్షకులకు మరింత దగ్గరగా తీసుకెళ్లేలా, పూర్తి స్థాయి గొప్ప ఆడియో అనుభూతిని అందించే విధంగా ఈ థియేటర్‌ను రూపొందించారు.

ప్రీమియం సినిమా ఎక్స్‌పీరియెన్స్ కేవలం స్క్రీన్లకే పరిమితం కాకుండా, ప్రేక్షకుల కంఫర్ట్, ఎక్స్క్లూజివిటీకి ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చేలా థియేటర్లో ప్రత్యేక సదుపాయాలను ఏర్పాటు చేశారు. రెక్లెయినర్ టికెట్లు తీసుకున్న ప్రేక్షకుల కోసం ఐకాన్ స్టార్ లాంజ్‌లో ప్రత్యేకమైన విఐపీ ఎంట్రీతో పాటు, సినిమా ప్రారంభమయ్యే ముందు రిలాక్స్ అయ్యేందుకు ప్రత్యేక సీటింగ్‌ను అందుబాటులో ఉంచారు. అలాగే ప్రైవేట్ బుకింగ్స్, స్పెషల్ స్క్రీనింగ్స్ కోసం 82 లాంజ్‌ను ప్రత్యేకంగా రూపొందించారు. వ్యక్తిగతంగా, ప్రత్యేకమైన అనుభూతిని అందించేలా ఈ లాంజ్‌ను ఏర్పాటు చేశారు.
ఈ అనుభూతిని మరింత ప్రత్యేకంగా మార్చేందుకు క్వాలిటీ ఫుడ్, బెవరేజెస్‌ను కూడా ప్రత్యేకంగా అందిస్తున్నారు. థియేటర్లోనే తాజాగా తయారు చేసే రుచికరమైన ఫుడ్, డ్రింక్స్‌తో ప్రేక్షకులు ఒకే చోట పూర్తి స్థాయి ఎంటర్టైన్మెంట్ అనుభూతిని ఆస్వాదించవచ్చు. అత్యాధునిక టెక్నాలజీ, ఇమ్మర్సివ్ సౌండ్, ప్రీమియం స్పేసెస్, తాజాగా తయారు చేసే ఫుడ్‌తో పాటు ప్రత్యేకమైన హాస్పిటాలిటీని అందిస్తూ AAA సినిమాస్ కేవలం ఒక థియేటర్‌గా మాత్రమే కాకుండా, పూర్తి స్థాయి సినిమా డెస్టినేషన్‌గా నిలుస్తోంది. భారీ స్థాయి, అత్యాధునిక టెక్నాలజీ, ప్రీమియం అనుభూతిని ఒకే చోట అందిస్తూ విశాఖపట్నంలో సినిమా చూసే అనుభవాన్నే కొత్తగా నిర్వచించేందుకు AAA సినిమాస్ సిద్ధమైంది.
AAA సినిమాస్ రాకతో విశాఖపట్నం ఎంటర్టైన్మెంట్ ల్యాండ్‌స్కేప్‌లో కొత్త అధ్యాయం మొదలైంది. భారీ స్థాయిలో, అద్భుతమైన అనుభూతితో ప్రతి అంశంలోనూ ప్రత్యేకతను చాటుకునేలా రూపొందించిన ఈ థియేటర్ ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా అనుభవాన్ని అందించనుంది.








