Vasishta: విశ్వంభర గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ప్రస్తుతం వశిష్ట(Vassishta) దర్శకత్వంతో విశ్వంభర(Viswambhara) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాటూ అనీల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో మెగా157(Mega157) ను కూడా చిరూ చేస్తున్నాడు. అయితే ఈ రెండింట్లో ముందుగా విశ్వంభర సినిమానే రిలీజ్ కానుంది. ఇప్పటికే విశ్వంభర నుంచి టీజర్ రిలీజవగా దానికి ఆడియన్స్ నుంచి వీఎఫ్ఎక్స్ విషయంలో నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి.
దీంతో మేకర్స్ ఆ బాధ్యతల్ని కొత్త వీఎఫ్ఎక్స్ టీమ్ కు అప్పగించి చేయిస్తున్నారు. ఇదిలా ఉంటే రీసెంట్ గా డైరెక్టర్ వశిష్ట ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ విశ్వంభర గురించి కొన్ని విషయాలను వెల్లడించాడు. ఈ సినిమాలో మొత్తం ఐదుగురు హీరోయిన్లు నటిస్తున్నారని చెప్పాడు. త్రిష(Trisha) మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఆషికా రంగనాథన్(Aashika Ranganathan) సెకండ్ హీరోయిన్ గా నటిస్తున్నారని, మిగిలిన ముగ్గురు కథానుగుణంగా కనిపిస్తారని తెలిపాడు.
ఆ ఐదుగురు భామలూ సినిమాకు కొత్తదనాన్ని తెస్తారని చెప్పిన విశ్వంభర ఈ సినిమా కథకు, అవతార్(Avathar) కు ఎలాంటి పోలిక లేదని, ఆ సినిమా కోసం తాను స్పెషల్ గా ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించానని చెప్పాడు. విశ్వంభర రిలీజ్ లేటవడానికి వీఎఫ్ఎక్స్ కారణమని, సినిమాపై తానెంతో కాన్ఫిడెంట్ గా ఉన్నానని, ఏ విషయంలోనూ తనకు ఒత్తిడి లేదని వశిష్ట చెప్పాడు.







