గోపీచంద్‌తో మొత్తం సెట్ చేసిన శ్రీను వైట్ల
ఒకప్పుడు కామెడీ అండ్ కమర్షియల్ మూవీస్ తో వరుస హిట్లు అందుకున్న డైరెక్టర్ శ్రీను వైట్ల. ఇప్పటికీ శ్రీను వైట్ల కామెడీ సీన్స్ కామెడీ సీన్స్ నెట్టింట తెగ కనిపిస్తుంటాయి. అలాంటి శ్రీను వైట్లకు ప్రస్తుతం బ్యాడ్ టైమ్ నడుస్తుంది. ఆయన నుంచి వచ్చిన గత సినిమాలన్నీ వరుస ఫ్లాపులుగా నిలిచాయి. అమర్ అక్బర్ ఆంటోనీ మూవీ శ్రీను వైట్లను దారుణంగా దెబ్బ కొట్టింది. ఆ తర్వాత మంచు విష్ణుతో ఢీ సీక్వెల్ అనౌన్స్ చేశారు కానీ ఆ సినిమా కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. ఇక అసలు విషయానికొస్తే శ్రీను వైట్ల గోపీచంద్‌కు ఓ స్టోరీ చెప్పి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్నాడని తెలుస్తోంది. ఈ సినిమా కు లోకేషన్ల వేట కోసం ప్రస్తుతం శ్రీను వైట్ల టీమ్ తో బయటకు వెళ్లినట్లు సమాచారం. ఈ మూవీ మొదటి షెడ్యూల్ ఇటలీ జరగనుందట.
సెప్టెంబర్ 9న ఈ కలయికలో మూవీని హైదరాబాద్‌లో గ్రాండ్ గా లాంఛ్ చేయనున్నట్లు సమాచారం. 20వ తేదీ తర్వాత ఇటలీలో సినిమా రెగ్యులర్ షూట్ ను స్టార్ట్ చేయనున్నారు. అక్కడ మేజర్ సన్నివేశాలను తెరకెక్కించాక తర్వాతి షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో ప్లాన్ చేస్తున్నారట. గోపీచంద్ కూడా ప్రస్తుతం హిట్ ట్రాక్ లో లేకపోవడంతో ఈ సినిమా సక్సెస్ ఇటు గోపీచంద్‌కు, అటు శ్రీను వైట్లకు ఇద్దరికీ కీలకం కానుంది.













