96 Movie: ఆ సినిమా మొదటి ఆప్షన్ సేతుపతి కాదట

కోలీవుడ్ లో వచ్చిన క్లాసిక్ సినిమాల్లో 96 కూడా ఒకటి. విజయ్ సేతుపతి(Vijay Sethupathi), త్రిష(Trisha) ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా మంచి సక్సెస్ ను అందుకుంది. తమిళంలో భారీ హిట్ గా నిలిచిన ఈ సినిమాను తెలుగులో జాను(Jaanu) అనే పేరిట రీమేక్ చేశారు. అయితే జాను సినిమా అనుకున్న అంచనాలను అందుకోలేకపోయింది. ప్రేమ్ కుమార్(Prem Kumar) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ముందు అనుకున్న హీరో వేరే అని చాలా మందికి తెలియదు.
డైరెక్టర్ ఈ సినిమాను ముందు బాలీవుడ్ లో చేద్దామనుకున్నాడట. బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్(Abhishek Bachan) తో ఈ సినిమాను తీయాలనుకుని 96 కథను రెడీ చేసుకున్నాడట ప్రేమ. ఈ విషయాన్ని స్వయంగా డైరెక్టరే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. అయితే ఆ సమయంలో తనకు బాలీవుడ్ లో ఎక్కువ పరిచయాలు లేకపోవడంతో ఎవరిని సంప్రదించాలో తెలియలేదని చెప్పాడు.
అలా మొత్తానికి తమిళంలో విజయ్ సేతుపతి, త్రిషతో ఈ సినిమాను తీశానని, తన తండ్రిలో నార్త్ ఇండియాలో పెరగడం వల్ల అతని ప్రభావం తనపై ఎక్కువగా ఉండేదని, ఆ కారణంతోనే తానెప్పుడూ హిందీ సినిమాలు చూసేవాడినని ప్రేమ్ కుమార్ చెప్పాడు. ఒకవేళ 96 సినిమాను అభిషేక్ బచ్చన్ తో తీసి ఉంటే బాలీవుడ్ లో ఓ క్లాసిక్ గా మిగిలేదేమో.