భారీ రేటుకు దాదా డిజిటల్ రైట్స్
నందమూరి బాలకృష్ణ(nandamuri balakrishna) దాదా(Dada) సినిమా రిలీజ్‌కు ముందే బిజినెస్ పరంగా స్పెషల్ లెవెల్ ను అందుకుంటోంది. ఈ సినిమాకు సంబంధించిన నాన్ థియేట్రికల్ రైట్స్ భారీ మొత్తానికి పూర్తవడం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. బాలకృష్ణ గత సినిమాలతో పోలిస్తే ఈ డీల్ భారీ వాల్యూను అందుకోవడం విశేషం. జీ స్టూడియోస్(Zee Studios) డిజిటల్, శాటిలైట్, మ్యూజిక్ రైట్స్ ను సొంతం చేసుకోవడంతో సినిమా థియేట్రికల్ రిలీజ్‌కు ముందే గణనీయమైన రికవరీ సాధించినట్టైంది.
ఇక డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా దాదాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ అనౌన్స్ చేశారు. ప్రస్తుతం ఈ రిలీజ్ డేట్‌ను టార్గెట్ చేస్తూ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. డైరెక్టర్ గోపీచంద్ మలినేని(gopichand malineni) బాలకృష్ణకు సంబంధించిన షూటింగ్ మినహా మిగిలిన కీలక భాగాలను పూర్తి చేయడంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ను కూడా ప్రారంభించారు. దీంతో సినిమా నిర్మాణం చివరి దశకు చేరుకున్నట్టుగా తెలుస్తోంది.
ఇటీవల షూటింగ్లో గాయపడిన బాలకృష్ణకు సర్జరీ జరిగిన నేపథ్యంలో ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. అక్టోబర్ మొదటి వారంలో తిరిగి సెట్స్‌లోకి అడుగుపెట్టనున్నట్లు సమాచారం. బాలకృష్ణ సరసన కాజల్ అగర్వాల్(kajal aggarwal) హీరోయిన్ గా నటిస్తుండగా, తమన్(thaman) సంగీతం అందిస్తున్నారు. పెద్ది(Peddi) నిర్మాత వెంకట సతీష్ కిలారు(venkata satish kilaru) నిర్మిస్తున్న ఈ మాస్ ఎంటర్టైనర్పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.








