ది ట్రైటర్స్ లో ఫస్ట్ కంటెస్టెంట్ గా చిన్మయి
ది ట్రైటర్స్(the traitors) తెలుగు రియాలిటీ షోలో తొలి కంటెస్టెంట్‌గా సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద(chinmayi sripada) పేరు అఫీషియల్ గా ఫిక్సైంది. ఇప్పటివరకు తన సింగింగ్‌తో, డబ్బింగ్‌తో ఆడియన్స్ కు పరిచయమైన చిన్మయి.. ఇకపై పూర్తిగా భిన్నమైన వేదికపై కనిపించబోతున్నారు. నటుడు తేజ సజ్జ(teja sajja) హోస్ట్‌గా వ్యవహరించనున్న ఈ షో ద్వారా ఆమె వ్యక్తిత్వంలోని మరో యాంగిల్ ను ఆడియన్స్ చూసే అవకాశం ఉంది. ముఖ్యంగా తన అభిప్రాయాలను స్పష్టంగా వ్యక్తం చేసే చిన్మయి.. ఇలాంటి స్ట్రాటజిక్ గేమ్‌లో ఎలా ఆడతారన్నది ఆసక్తిని పెంచుతోంది.
ది ట్రైటర్స్ ఫార్మాట్లో ఆట కంటే నమ్మకం, అనుమానం, వ్యూహాలకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. కంటెస్టెంట్లలో కొందరు ట్రైటర్స్గా రహస్యంగా వ్యవహరిస్తే.. మిగిలిన వారు ఫెయిత్ఫుల్స్గా వారిని గుర్తించే ప్రయత్నం చేస్తారు. ఎవరిని నమ్మాలి, ఎవరిపై అనుమానం పెట్టాలి అనే నిర్ణయాలే ప్రతి ఎపిసోడ్లో ఉత్కంఠకు కారణంగా మారతాయి. ఈ నేపథ్యంలో చిన్మయి వంటి బలమైన అభిప్రాయాలు కలిగిన వ్యక్తి గేమ్‌లోకి రావడం షోపై మరింత ఆసక్తిని పెంచే అంశంగా మారింది.
హిందీ వెర్షన్‌కు కరణ్ జోహార్(karan johar) హోస్ట్‌గా వ్యవహరించడంతో ఈ అంతర్జాతీయ ఫార్మాట్ ఇప్పటికే ఇండియన్ ఆడియన్స్ కు పరిచయమైంది. ఇప్పుడు అదే కాన్సెప్ట్‌ను తెలుగు నేటివిటీకి అనుగుణంగా తీసుకురావడంపై ఆసక్తి నెలకొంది. తొలి కంటెస్టెంట్‌గా చిన్మయి పేరు అనౌన్స్ చేయడంతో మొదలైన బజ్.. మిగిలిన కంటెస్టెంట్ల ఎంపికపై అంచనాలను పెంచుతోంది. అక్టోబర్ 15న ఫస్ట్ సీజన్ ప్రారంభం కానుండగా, త్వరలోనే మరిన్ని పేర్లు వెల్లడయ్యే అవకాశం ఉంది.








