తమన్ నుంచి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు
తమన్(thaman) నుంచి గుంటూరు కారం(guntur karam) తర్వాత మళ్లీ ఆ స్థాయి సినిమా వచ్చింది లేదు. హిట్ సినిమాలన్నీ వేరే వాళ్ల అకౌంట్ లో పడిపోవడంతో బాక్సాఫీస్ వద్ద తమన్ మేజిక్ ఎప్పుడు వర్కవుట్ అవుతుందా అని ఆయన ఫ్యాన్స్ ఎంతో ఎదురుచూశారు. ఇప్పుడు ఆ ఎదురుచూపులకు తెర దించే సమయం దగ్గరపడటమే కాకుండా తమన్ వరుస సినిమాలతో మ్యూజిక్ లవర్స్ ను ఉక్కిరిబిక్కిరి చేయడానికి రెడీ అవుతున్నాడు.
తమన్ వర్క్ చేస్తున్న సినిమాల రిలీజ్ డేట్స్ అన్నీ తక్కువ గ్యాప్ లో వచ్చేస్తుండటంతో ఆయనకు పని ఒత్తిడి బాగా ఎక్కువవుతున్నట్లు తెలుస్తోంది. ముందుగా దీపావళి(Deepavali)ని టార్గెట్ గా పెట్టుకున్న గేమ్ ఛేంజర్ టీజర్(Game changer Teaser) బీజీఎం వర్క్ లో బిజీగా ఉన్నాడు. దాంతో పాటూ బాలయ్య109(NBK109) టైటిల్, టీజర్ కూడా దీపావళి(Diwali)కే రెడీ చేయిస్తున్నారు.
డిసెంబర్ 25న రిలీజ్ కానున్న బేబీ జాన్(Baby John) మూవీ కోసం ముంబైకి వెళ్లి రావాల్సి వస్తోంది. సిద్దు జొన్నలగడ్డ(sidhu jonnalagadda) తెలుసు కదా(Thelusu Kadha) షూటింగ్ ఎంతో వేగంగా జరుగుతున్న నేపథ్యంలో దానిక్కూడా ప్రిపేర్ కావాల్సి వస్తుంది. ఇవన్నీ ఒకెత్తయితే ప్రభాస్(Prabhas) ది రాజా సాబ్(the raja Saab), పవన్ కళ్యాణ్(pawan kalyan) ఓజీ(OG) కూడా పనివేగం పెంచాల్సిన అవసరం ఉంది. ఈ రెండు సినిమాల రిలీజ్ కు టైమ్ ఉన్నప్పటికీ అవసరం ఏ రూపంలో వస్తుందో తెలియదు కాబట్టి తమన్ అన్నింటికి సిద్ధపడి ఉండాలి. మరోవైపు అఖండ2(akhanda2) కూడా తమన్ చేతిలోనే ఉంది. ఇదంతా చూస్తుంటే వచ్చే ఏడాది వరకు తమన్ ఫుల్ బిజీగా ఉంటాడని అర్థమవుతుంది.













