కాకాలో అనురాగ్ కశ్యప్.. యాక్షన్ కు మరింత వెయిట్
మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi) హీరోగా బాబీ కొల్లి(bobby kolli) తెరకెక్కిస్తున్న కాకా(kaaka)పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. బర్త్‌డే సందర్భంగా రిలీజైన టైటిల్ గ్లింప్స్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచగా, ఇప్పుడు మేకర్స్ మరో కీలక అప్డేట్తో హైప్ పెంచింది. బాలీవుడ్లో డైరెక్టర్ గా తనదైన ముద్ర వేసిన అనురాగ్ కశ్యప్(Anurah kashyap) ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. హైదరాబాద్‌లో జరుగుతున్న షూటింగ్లో ఆయన పాల్గొంటున్నారు. బాబీ కొల్లితో సీన్ గురించి డిస్కస్ చేస్తున్న అనురాగ్ కశ్యప్ బీటీఎస్ ఫోటోను మేకర్స్ రిలీజ్ చేశారు.
ప్రస్తుతం కాకా షూటింగ్లో సెకండాఫ్‌కు సంబంధించిన హై ఆక్టేన్ యాక్షన్ ఎపిసోడ్స్‌ను షూట్ చేస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ హాఫ్‌ను లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌పై వర్క్ చేస్తున్నారు. యాక్షన్, ఎమోషన్, చిరంజీవి స్టైల్ అండ్ స్వాగ్‌ను మిక్స్ చేస్తూ సెకండాఫ్‌ను మరింత పవర్‌ఫుల్‌గా తీర్చిదిద్దుతున్నట్లు టాక్. షూటింగ్ పూర్తైన వెంటనే ప్రమోషన్స్‌ను భారీ స్థాయిలో ప్రారంభించేందుకు టీమ్ ప్లాన్ చేస్తోంది.
సంక్రాంతి బరిలో జనవరి 13న ఆడియన్స్ ముందుకు రావడమే టార్గెట్ గా కాకా టీమ్ ముందుకు సాగుతోంది. అనస్వర రాజన్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో చిరంజీవి(chiranjeevi)ని ఇప్పటివరకు చూడని పవర్ఫుల్ షేడ్స్‌లో చూపించబోతున్నామని మేకర్స్ చెబుతున్నారు. ముఖ్యంగా ఆయన కామెడీ టైమింగ్, చార్మ్, స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తాయని అంటున్నారు. వాల్తేరు వీరయ్య(valtair veerayya) తర్వాత చిరంజీవి- బాబీ కాంబినేషన్ కావడంతో ఈ సంక్రాంతికి కాకా పై అంచనాలు మరింత పెరుగుతున్నాయి.







