మైత్రీ మూవీ మేకర్స్ భారీ ప్లాన్.. 300 ఎకరాల్లో ఇంటర్నేషనల్ ఫిల్మ్ స్టూడియో?
టాలీవుడ్లో అగ్ర నిర్మాణ సంస్థగా గుర్తింపు తెచ్చుకున్న మైత్రీ మూవీ మేకర్స్(Mythri movie makers) మరో కీలక రంగంలోకి అడుగుపెట్టబోతున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో డిస్కషన్ జరుగుతోంది. సుమారు 300 ఎకరాల విస్తీర్ణంలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో కూడిన ఫిల్మ్ స్టూడియోను నిర్మించేందుకు నిర్మాణ సంస్థ ల్యాండ్‌ను సేకరించినట్లు ప్రచారం సాగుతోంది. అయితే, ఈ వార్తలపై మైత్రీ మూవీ మేకర్స్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ వెలువడలేదు. ఇప్పటికే సినిమాల నిర్మాణంతో పాటు డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్ రంగాల్లోనూ తనదైన ముద్ర వేసిన ఈ సంస్థ స్టూడియో వ్యాపారంలోకి ఎంటరైతే, టాలీవుడ్లో మరో కీలక పరిణామంగా మారే అవకాశం ఉంది.
కరోనా తర్వాత హైదరాబాద్‌లో సినిమా నిర్మాణానికి అవసరమైన మౌలిక సదుపాయాలు గణనీయంగా పెరిగాయి. ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్ పరిసర ప్రాంతాల్లో కొత్త స్టూడియోలు, షూటింగ్ ఫ్లోర్లు, స్పెషల్ షూటింగ్ ప్రదేశాలు అందుబాటులోకి వచ్చాయి. అయినప్పటికీ, ఏటా పెరుగుతున్న సినిమా ప్రాజెక్టులు, భారీ బడ్జెట్ సినిమాలు, ఓటీటీ సంస్థలు నిర్మిస్తున్న వెబ్ సిరీస్‌ల కారణంగా అందుబాటులో ఉన్న స్టూడియోలకు డిమాండ్ పెరుగుతోంది.
ఇవి కూడా చదవండి
ఈ నేపథ్యంలో మైత్రీ మూవీ మేకర్స్ స్టూడియో రంగంలోకి వస్తే, ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక సాంకేతికతతో కూడిన సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావచ్చు. భారీ సెట్స్, విభిన్న లొకేషన్లు, ఒకేసారి పలు ప్రాజెక్టుల షూటింగ్ కు అనువైన వసతులు కల్పిస్తే సంస్థకు కొత్త వ్యాపార అవకాశాలు లభిస్తాయి. అయితే, 300 ఎకరాల భూమి సేకరణ, స్టూడియో నిర్మాణంపై అఫీషియల్ క్లారిటీ ఉంది.








