డొనాల్డ్ ట్రంప్ కు షాకిచ్చింది మన తెలుగు లాయరే…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అకౌంట్‌ను ట్విటర్ శాశ్వతంగా తొలగించిన విషయం తెలుసు కదా. కానీ ఈ సాహసోపేత, ఆసాధారణ నిర్ణయం వెనుక ఉన్నది మాత్రం మన తెలుగు లాయరే అన్న విషయం మాత్రం ఎవరికీ తెలియదు. ఆమె పేరు విజయ గద్దె. ట్విటర్ సంస్థ లీగల్, పాలసీ, ట్రస్ట్, సేఫ్టీ అంశాలు చూసుకునేది ఈమెనే. ట్రంప్ అకౌంట్‌ను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది కూడా విజయనే కావడం గమనార్హం. మరింత హింస చెలరేగే ప్రమాదం ఉన్న దృష్ట్యా డొనాల్డ్ ట్రంప్ అకౌంట్‌ను ట్విటర్ శాశ్వతంగా రద్దు చేసింది అని విజయ ఈ నెల 9న ట్వీట్ చేశారు.
ఇండియాలోనే జన్మించిన విజయ చిన్నతనంలోనే అమెరికా వెళ్లిపోయారు. టెక్సాస్‌లో పెరిగారు. ఆమె తండ్రి గల్ఫ్ ఆఫ్ మెక్సికో ఆయిల్ రిఫైనరీలలో కెమికల్ ఇంజినీర్‌గా పని చేసేవారు. న్యూజెర్సీలో హైస్కూల్లో పూర్తి చేసిన విజయ.. న్యూయార్క్ యూనివర్సిటీ లా స్కూల్లో చదివారు. ట్విటర్ సంస్థలో 2011లో చేరారు. 2018లో ట్విటర్ కోఫౌండర్ జాక్ డోర్సీ.. ట్రంప్‌ను కలవడానికి వైట్‌హౌజ్ వెళ్లినప్పుడు విజయ కూడా ఆయన వెంటే ఉన్నారు. అంతేకాదు అదే ఏడాది నవంబర్‌లో ప్రధాని నరేంద్ర మోదీనికి కూడా ఈ ఇద్దరూ కలిశారు. గత దశాబ్ద కాలంలో ఆమె చాలా పేరు సంపాదించారు. విజయ్ మోస్ట్ పవర్‌పుల్ సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ అంటూ ది పొలిటికో అభివర్ణించింది.






