Russia : రష్యాకు అనుకూలంగా డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా (Russia)కు అనుకూలంగా మరో కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. 1990 తర్వాత నాటో (NATO)లో చేరిన దేశాల్లో ఉన్న అమెరికా(America) సేనలను వెనక్కి పిలిపించాలని ట్రంప్ (Trump) సర్కారు భావిస్తోంది. దీంతో అల్బానియా, బల్గేరియా, క్రొయేషియా, ఎస్తోనియా, ఫిన్లాండ్, హంగేరీ, లాత్వియా, లిథువేనియా, మాంటెనెగ్రో, నార్త్ మెసిడోనియా, పోలాండ్, రోమానియా, స్లొవేకియా, స్లొవేనియా, స్వీడన్‌ల నంచి దళాలు వెనక్కి వచ్చే అవకాశాలున్నాయి. దీటితోపాటు ఇటలీ(Italy), కొసొవో నుంచి అమెరికా దళాలు వైదొలిగే అవకాశాలున్నాయి.