భారత్ పై ఒత్తిడి పెంచుతున్న అమెరికా
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సిగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్‌పై అమెరికా నెమ్మదిగా ఒత్తిడి పెంచుతోంది. ఈ కేసులో కెనడాకు సహకరించాలని ప్రైవేట్‌గా, బహిరంగంగా అభ్యర్థించామని స్పష్టం చేసింది. ఈ కేసులో న్యాయబద్ధంగా నిందితులను కోర్టులో హాజరుపరచాలని స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ కోరారు. కెనడా ఆరోపణలపై కలత చెందామన్ని పేర్కొన్న ఆయన, ఆ దేశంతో టచ్‌లో ఉన్నట్లు తెలిపారు. కాలిఫోర్నియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న యూఎస్ హౌస్ సభ్యుడు జిమ్ కోస్టా కూడా నిజ్జర్ హత్య కేసుపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కేసుపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరపాలని కోరారు. బాధ్యులైనవారిని కఠిన శిక్షలు పడాలని అన్నారు. ఇందుకు భారత్ సహకరించాలని కోరారు.






