బైడెన్ రూటే సెపరేట్….
అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత బైడెన్ తన కార్యాలయం తీరును మార్చివేశారు. ఓవల్ ఆఫీసులోని అమెరికా అధ్యక్షుడి టేబుల్‌పై ట్రంప్‌కు ప్రీతిపాత్రమైన రెడ్ బటన్‌ను తీసేయించారు. ట్రంప్ తన హయాంలో టేబుల్‌పై చెక్క బాక్సుతో కూడిన ఎర్ర కలర్ మీను ఏర్పాటు చేసుకున్నారు. డైట్ కోక్ అంటే ట్రంప్‌కు ఎంతో ఇష్టం. కోక్ కావాలనుకున్నప్పుడల్లా ఆ మీటను ట్రంప్ నొక్కేవారు. నొక్కిన ప్రతిసారి వెండిపళ్లెంలో ఓ డైట్ కోక్‌ను పెట్టుకొని ఓ నౌకరు ఆ గదిలోకి ప్రవేశించి ట్రంప్‌కు అందజేసేవాడు. అయితే ఈ బటన్, ట్రంప్ అధ్యక్షుడు కాక మునుపు నుంచే ఆ టేబుల్ మీద ఉండేది. ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన కూడా ఈ మీటను ఉపయోగించేవారు. ఇప్పుడు కొత్త అధ్యక్షుడిగా బైడెన్ బాధ్యతలు చేపట్టాక టేబుల్‌పై ఈ మీట మాయమైంది. అధ్యక్షుడిగా తొలిరోజు ఆయన టేబుల్‌పై రెండు ఫోన్లు, ఓ కాఫీ కప్పు, ఓ పెన్నుల సెట్టు మాత్రమే కనిపించాయి. అధ్యక్ష పదవిని చేపట్టినవారిలో చాలామంది తమ అభిరుచులకు అనుగుణంగా కార్యాలయాన్ని మార్పుకోవడం సహజం. బైడన్ రావడంతో ఇప్పుడూ ఓవల్ ఆఫీసు కొత్తగా కనిపిస్తోంది.






