ట్రంప్ సహా కొందరి హత్యకు కుట్ర.. ఎఫ్‌బీఐ భగ్నం
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా కొందరు రాజకీయ నాయకులను హత్య చేసేందుకు ఓ పాకిస్థానీ పన్నిన కుట్రను ఎఫ్‌బీఐ భగ్నం చేసింది. నిందితుడికి ఇరాన్‌తో కూడా బలమైన సంబంధాలున్నాయి. ఈ విషయాన్ని ఎప్బీఐ డైరెక్టర్ క్రిస్టపర్వ్రే వెల్లడించారు. ఇరాన్ చేయించే కిరాయి హత్య కుట్రగా దీనిని ఆయన పేర్కొన్నారు. ఈ క్ణేసులో పాకిస్థాన్‌కు చెందిన 46 ఏళ్ళ ఆసీఫ్ మర్చెంట్ అమెరికన్లను చంపేందుకు కిరాయి హంతకుడిని నియమించుకునేందుకు ప్రయత్నిస్తుండగా అమెరికా అధికారులు న్యూయార్క్‌లో అరెస్టు చేశారు. అతడి టార్గెట్లలో డొనాల్డ్ ట్రంప్ కూడా ఉన్నట్లు అధికారులు వెల్లడిరచారు.






