Artificial Intelligence: సంచలనం రూ..300 కొని.. రూ. 634 కోట్లకు అమ్మి
Artificial Intelligence: ఇంటర్నెట్ ప్రపంచంలో ఒక చిన్న పెట్టుబడి ఏ స్థాయిలో లాభాలను తెచ్చిపెడుతుందో చెప్పడానికి మలేషియాకు చెందిన టెక్ వ్యాపారవేత్త అర్స్యాన్ ఇస్మాయిల్ జీవితమే ఒక ఉదాహరణ. 1993లో కేవలం 10 ఏళ్ల వయసులో, తన పేరులోని మొదటి అక్షరాలు (Arsyan Ismail – AI) కలిసి వస్తాయని సరదాగా కొన్న ఒక వెబ్సైట్ పేరు, నేడు అతడిని కోటీశ్వరుడిని చేసింది.
అమ్మ కోపమే అతనికి శాపమైంది.. ఇప్పుడు వరమైంది: 1993లో అర్స్యాన్ తన తల్లి క్రెడిట్ కార్డును ఉపయోగించి అప్పట్లో సుమారు $100 (నేటి విలువలో దాదాపు ₹300-400) తో ‘ai.com’ అనే డొమైన్‌ను రిజిస్టర్ చేశాడు. తెలియకుండా కార్డ్ వాడినందుకు అప్పట్లో వాళ్ల అమ్మ అతనిపై చాలా కోప్పడ్డారు. కానీ 30 ఏళ్ల తర్వాత అదే డొమైన్ అతనికి ఊహించని సంపదను తెచ్చిపెట్టింది.
OpenAI వాడకం: గతంలో ఈ డొమైన్‌ను ప్రపంచ ప్రసిద్ధ సంస్థ ‘OpenAI’ (ChatGPT సృష్టికర్త) కూడా లీజుకు తీసుకుని వాడింది. అప్పట్లో చాట్‌జీపీటీకి రీడైరెక్ట్ చేయడానికి దీనిని ఉపయోగించేవారు.
భారీ డీల్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు (AI) ప్రపంచవ్యాప్తంగా పెరిగిన క్రేజ్ చూసి, ప్రముఖ క్రిప్టోకరెన్సీ ప్లాట్‌ఫారమ్ ‘Crypto.com’ వ్యవస్థాపకుడు క్రిస్ మార్జాలెక్, ఈ డొమైన్‌ను ఏకంగా 70 మిలియన్ డాలర్లకు (సుమారు ₹634 కోట్లు) కొనుగోలు చేశారు. ఈ చెల్లింపు పూర్తిగా క్రిప్టోకరెన్సీలోనే జరగడం విశేషం.
వరల్డ్ రికార్డ్: పబ్లిక్‌గా వెల్లడైన డొమైన్ సేల్స్ చరిత్రలో ఇదే అత్యంత ఖరీదైన డీల్‌గా నిలిచింది. గతంలో ‘CarInsurance.com’ పేరిట ఉన్న రికార్డును ఇది అధిగమించింది.
ప్రస్తుతం ఈ ‘ai.com’ ద్వారా క్రిస్ మార్జాలెక్ ఒక సరికొత్త ‘పర్సనల్ ఏఐ ఏజెంట్’ ప్లాట్‌ఫారమ్‌ను లాంచ్ చేశారు. దీనికి సంబంధించిన ప్రకటనను ఇటీవల అమెరికాలో జరిగిన ప్రతిష్టాత్మక ‘సూపర్ బౌల్’ (Super Bowl LX) ఈవెంట్లో ప్రదర్శించారు. కేవలం అక్షరాల కలయిక కోసం కొన్న పేరు, ఒక టెక్నాలజీ విప్లవానికి చిరునామాగా మారి అర్స్యాన్ను బిలియనీర్ల జాబితాలో చేర్చింది.
ఇవి కూడా చదవండి::::::













