Donald Trump: సుంకాలు విధించకుండానే మోసం.. ట్రంప్ మరోసారి ఫైర్!

సుంకాల యుద్దానికి 90 రోజుల విరామం ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తమతో వాణిజ్యం చేసే దేశాల మీద మరోసారి విరుచుకుపడ్డారు. పలు పరోక్ష, అనైతిక విధానాల ద్వారా అవి తమకు ఆర్థికంగా నష్టపరుస్తున్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు గుడ్‌ఫ్రైడే (Good Friday) సందర్భంగా ట్రంప్ నాన్ టారిఫ్ చీటింగ్ (Non-tariff cheating) ( సుంకాలు విధించకుండానే మోసం) పేరుతో 8 అంశాలను ప్రస్తావించారు. వాటిలో 1. కరెన్సీ మోసాలు 2. సుంకాల రూపంలో వసూలు చేసే వ్యాట్ ట్యాక్స్‌లు (VAT taxes), సబ్సిడీల ఎగుమతులు 3. చవక సరుకులను తెచ్చి మార్కెట్లను ముంచెత్తటం 4. ప్రభుత్వ సబ్సిడీలు 5. విదేశీ ఉత్పత్తుల నుంచి ఆయా దేశాలు తమ వ్యవసాయోత్పత్తులకు రక్షణ కల్పించటం (యూరోపియన్ యూనియన్ దేశాల్లో జన్యుపరివర్తిత మొక్కజొన్నను అనుమతించపోవటం) 6. సాంతికేక ప్రమాణ పేరుతో విదేశీ ఉత్పత్తులను అడ్డుకోవటం (జపాన్ బౌలింగ్ టెస్ట్) 7. పైరసీ, మేధోహక్కుల చోరీ ( ఏటా లక్ష కోట్ల డాలర్లకుపైగా) 8. సుంకాలను తప్పించుకోవటానికి సముద్రరవాణా మార్గాలను ఎంచుకోవటం వంటి అంశాలను ట్రంప్ పేర్కొన్నారు.