Truth Social : ట్రూత్ సోషల్ సీఈవోకు ట్రంప్ కీలక పదవి
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తన ప్రభుత్వ కార్యవర్గ ఏర్పాటును ముమ్మరం చేశారు. ఈ క్రమంలో తన సన్నిహితులకు, బంధువర్గానికి కీలక స్థానాలు కల్పిస్తున్నారు. తాజాగా ట్రూత్ సోషల్ సీఈవో డెవిన్ నూనెస్ (Devin Nunes ) కు ప్రెసిడెంట్ ఇంటెలిజెన్స్ అడ్వైజరీ బోర్డు చైర్మన్ బాధ్యతలను ట్రంప్ అప్పగించారు. ఈ సందర్భంగా ట్రంప్ స్పందించారు. ట్రూత్ సోషల్ సీఈవో డెవిన్ను ప్రెసిడెంట్ ఇంటెలిజెన్స్ అడ్వైజరీ బోర్డు చైర్మన్గా నియమిస్తున్నా. ఆయనకు హౌస్ ఇంటెలిజెన్స్ కమిటీ చైర్మన్గా చేసిన అనుభవం ఉంది. రష్యాకు సంబంధించిన బూటకపు సమాచారాన్ని బహిర్గతం చేయడంలో కీలక పాత్ర షోషించారు అని తెలిపారు.






