వెనక్కి తగ్గిన ట్రంప్
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల తర్వాత అద్ధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ మరియు అద్ధ్యక్షులు ట్రంప్ ప్రచార బృందం ఎన్నికల ఫలితాల పై వివిధ న్యాయస్థానాలలో అనేక రకాల దావాలు దరఖాస్తు చేసిన సంగతి తెలిసిందే. అయితే కీలకమైన అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల గురించి ప్రశ్నలు లేవనెత్తడానికి బుధవారం 25 నవంబర్ 2020 న పెన్సిల్వేనియా మరియు జెట్టీస్ బర్గ్ రాష్ట్రల లోని శాసనసభ్యులు ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తుండడంతో ఈ కార్యక్రమాని కి హాజరు కావలసిన అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ తన పర్యటనను రద్దు చేశారు. అధ్యక్షులు ట్రంప్ యొక్క పబ్లిక్ షెడ్యూల్లో ఈ పర్యటన జాబితా చేయనప్పటికీ పెన్సిల్వేనియా పర్యటన కోసం వైట్ హౌస్ ట్రావెలింగ్ విలేకరుల బృందాన్ని సేకరించింది. తరువాత దానిని విరమించుకున్నట్లు విలేకరులకు చెప్పబడింది.
అధ్యక్షులు ట్రంప్ మరియు అతని న్యాయ బృందం పెన్సిల్వేనియా మరియు ఇతర ప్రాంతాలలో విస్తృతంగా ఓటింగ్ సమస్యలపై ఆరోపణలు చేసినప్పటికీ వాదనలకు మద్దతు ఆధారాలు ఇవ్వలేకపోయారు. పెన్సిల్వేనియా 80,555 ఓట్ల ఆధిక్యంతో బిడెన్ గెలిచినట్లు ధృవీకరించింది. అందుకే అధ్యక్షులు ట్రంప్ తన పర్యటనను విరమించుకున్నట్లు పలువురు అభిప్రాయపడ్డారు.
గెట్టిస్‌బర్గ్‌లో అధ్యక్షులు ట్రంప్ యొక్క వ్యక్తిగత న్యాయవాది రూడీ గియులియాని ఇతర రిపబ్లికన్లతో కలిసి పెన్సిల్వేనియా సెనేట్ మెజారిటీ పాలసీ కమిటీ సమావేశంలో ఎన్నికల సమస్యలు మరియు అవకతవకలపై ప్రశ్నించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మాజీ ఉపాధ్యక్షులు మిస్టర్ బిడెన్ గెలుపు ను అంగీకరించి ముందుకు వెళ్ళే నూతన మార్గం గురించి కొందరు అధ్యక్షులు ట్రంప్ సన్నిహితులు అధ్యక్షులు ట్రంప్ కి సూచిస్తుండగా మరికొందరు అధ్యక్షులు ట్రంప్‌ను పోరాటం కొనసాగించాలని ఒత్తిడి చేస్తున్నాట్లు సమాచారం.






