ఎన్నికలు సక్రమంగా జరిగాయన్న అధికారిపై ట్రంప్ వేటు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎలాంటి అక్రమాలు చోటుచేసుకోలేదని, చరిత్రలోనే అత్యంత సురక్షితంగా జరిగాయని వ్యాఖ్యానించిన హోం శాఖ ఉన్నతాధికారి ఒకరిని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలగించారు. ఈ వ్యాఖ్యను చేసిన అంతర్గత భద్రత శాఖ పరిధిలోని సైబర్ భద్రత, మౌలిక వసతుల భద్రత విభాగం డైరెక్టర్ క్రిస్టోఫర్ క్రెబ్స్ ను పదవి నుంచి తొలగించినట్టు ట్రంప్ ట్వీట్ చేశారు. ఎన్నికల్లో భద్రతపై క్రెబ్స్ చేసిన ప్రకటన సరికాదు. ఎన్నికల్లో చాలా అక్రమాలు జరిగాయి. చనిపోయిన వారి పేరున ఓట్లు పడ్డాయి. ఓటింగ్ యంత్రాలు మొరాయించడంతో ట్రంప్ ఓట్లు బైడెన్‌కు వెళ్లాయి. గడువు తరువాత వచ్చిన వారికి కూడా ఓటింగ్ అవకాశం కల్పించారు. ఈ కారణాల దృష్ట్యా క్రెబ్స్ ను తక్షణమే పదవి నుంచి తొలగిస్తున్నాను అని పేర్కొన్నారు.






