క్యాపిటల్ పై దాడిని ఖండిస్తున్నా : ట్రంప్
అమెరికా చట్టసభ క్యాపిటల్ హిల్ భవనంపై దాడిని తానూ వ్యతిరేకిస్తున్నాని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. క్యాపిటల్‌పై దాడి జరిగిన వెంటనే ఫెడరల్ సైన్యాన్ని రంగంలోకి దించినట్లు చెప్పారు. చొరబాటుదారులను వెంటనే భవనం నుంచి ఖాళీ చేయించామన్నారు. అమెరికా ఎప్పటికీ శాంతి భద్రతల దేశంగానే ఉంటుందని పేర్కొన్నారు. దేశ కొత్త అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికను అమెరికా కాంగ్రెస్ ధ్రువీకరించిందని చెప్పారు. ఈ నెల 20న నూతన ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. ప్రస్తుతం తన దృష్టంతా అధికార బదిలీపై ఉందని వెల్లడించారు. డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు అమెరికా చట్టసభ సభ్యులు కొలువుదీరే కాంగ్రెస్ భవనంపై అసాధారణ స్థాయిలో దాడులకు దిగిన విషయం తెలిసిందే.






