డొనాల్డ్ ట్రంప్ పై పెరుగుతున్న ఒత్తిడి…
అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ పగ్గాలు చేపట్టడానికి ముందుండే పరివర్తనా కాలంలో అధికార మార్పిడి పక్రియకు అడ్డుతగలొద్దంటూ డొనాల్డ్ ట్రంప్‌పై సొంత పార్టీ నుంచే ఒత్తిడి పెరుగుతోంది. అధ్యక్షుడిగా ఎన్నికైన బైడెన్ వైట్‌హౌస్‌లో ప్రభుత్వ అధికారులను ఉపయోగించుకునేందుకు, ప్రతి రోజూ ఇంటెలిజెన్స్ శాఖ నుంచి రిపోర్టులను తెప్పించుకునేందుకు ట్రంప్ అనుమతి నిరాకరిస్తున్నారు. ఈ ధోరణిని ట్రంప్ శుక్రవారం లోగా మార్చుకోవాలని, లేకుంటే తామే వైట్ హౌస్‌కు వెళ్లి ఆయనను పక్కకు తోసేయాల్సిన పరిస్థితి వస్తుందని రిపబ్లికన్ పార్టీకి చెందిన సెనేటర్ జేమ్స్ లాంక్‌ఫోర్డ్ హెచ్చరించారు. ఇటువంటి ప్రకటనలే మరి కొందరు సెనెటర్లు చేశారు.






