చైనా కంపెనీల్లో అమెరికా పెట్టుబడులపై నిషేధం
చైనా సంస్థలపై డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. 31 సంస్థల జాబితాను విడుదల చేస్తూ అందులో అమెరికన్లు పెట్టుబడులు పెట్టకూడదంటూ ఆదేశించింది. ఈ మేరకు కార్వనిర్వాహక ఉత్తర్వుపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. నిషేధిత జాబితాలోని సంస్థల్లో చైనా ప్రమేయం ఉందని ట్రంప్ ప్రభుత్వం చెబుతోంది. ఇందులో కొన్నింటిలో చైనా సైన్యం నేరుగా పెట్టుబడులు పెట్టిందని, మరి కొన్నింటిని పరోక్షంగా నియంత్రిస్తోందని అధికారులు తెలిపారు. వీటిలో పెట్టుబడి పెట్టడమంటే చైనా సైన్యాన్ని బలోపేతం చేయడమేనని అధికారులు పేర్కొంటున్నారు. నిషేధిత జాబితాలో చైనా మొబైల్, హువావే, చైనా టెలికాం తదితర సంస్థలు ఉన్నాయి.






